https://oktelugu.com/

ఏమున్నాడురా, ఇతనే మన హీరో !

‘మా నాన్నకు పెళ్ళి’ సినిమా చేస్తున్న రోజులు అవి. హీరోగా చాలా మంది పేర్లు పరిశీలించారు. చివరకు, శ్రీకాంత్‌ ను ఖరారు చేశారు. అప్పటికే శ్రీకాంత్‌ అంటే ఇండస్ట్రీలో అజాతశత్రువు అని పేరు ఉంది. పైగా కుర్రాడు మంచోడు అని నిర్మాతల్లో ఒక భావన ఉంది. దానికి తోడు శ్రీకాంత్ శరీర సౌష్టవం ఒక హీరోగా చాలా బాగుంటుంది. లవర్ బాయ్ పాత్రలతో పాటు సాఫ్ట్ పాత్రలకు కూడా శ్రీకాంత్ చాలా బాగా సరిపోయేవాడు. అందుకే, ‘మా నాన్నకు […]

Written By: , Updated On : August 12, 2021 / 06:10 PM IST
Follow us on

Actor Sreekanth

‘మా నాన్నకు పెళ్ళి’ సినిమా చేస్తున్న రోజులు అవి. హీరోగా చాలా మంది పేర్లు పరిశీలించారు. చివరకు, శ్రీకాంత్‌ ను ఖరారు చేశారు. అప్పటికే శ్రీకాంత్‌ అంటే ఇండస్ట్రీలో అజాతశత్రువు అని పేరు ఉంది. పైగా కుర్రాడు మంచోడు అని నిర్మాతల్లో ఒక భావన ఉంది. దానికి తోడు శ్రీకాంత్ శరీర సౌష్టవం ఒక హీరోగా చాలా బాగుంటుంది. లవర్ బాయ్ పాత్రలతో పాటు సాఫ్ట్ పాత్రలకు కూడా శ్రీకాంత్ చాలా బాగా సరిపోయేవాడు.

అందుకే, ‘మా నాన్నకు పెళ్ళి’ సినిమాలో హీరోగా మొదట నాగార్జునను అనుకున్నా.. శ్రీకాంత్ మంచితనం, అతనికి ఉన్న మంచి పేరు ఆ పాత్ర శ్రీకాంత్ కి వచ్చేలా చేసింది. శ్రీకాంత్ కూడా ఇటు విలనీకి సరిగ్గా సూట్ అయ్యేవాడు, అలాగే అటు హీరోగా వేస్తే ‘ఏమున్నాడురా, ఇతనే మన హీరో’ అన్నట్టు ఉండేవాడు. పైగా రొమాంటిక్‌ సీన్స్ లో అయితే ‘ప్రేమికుడు అంటే ఇలా ఉండాలి’ అనిపించేవాడు.

ఆ రోజుల్లో శ్రీకాంత్ కి ఇంత మంచి పేరు ఉంది కాబట్టే.. ‘మా నాన్నకు పెళ్ళి’ సినిమా షూటింగ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. రామోజీ ఫిల్మ్‌సిటీని అపుడే మొదలుపెట్టారు. పైగా రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుపుకున్న మొదటి సినిమా కూడా ‘మా నాన్నకు పెళ్ళి’ చిత్రమే. అందుకే, ఆ సినిమా షూటింగ్ సమయంలో రామోజీరావు గారు కూడా, సెట్ కి వెళ్తూ ఉండేవారట.

మొదటి నాలుగు రోజులు షూటింగ్ కి వచ్చి చూసి వెళ్లారు. మళ్ళీ వారం తర్వాత వచ్చి.. కోట శ్రీనివాసరావు పక్కన కూర్చుని సినిమా గురించి, అదే విధంగా ఫిల్మ్ సిటీలోని వసతులు గురించి రామోజీరావు గారు చెబుతూ.. హీరో శ్రీకాంత్ గురించి ఒక మాట చెప్పారట. ‘మీ హీరోగారు పద్ధతి నాకు బాగా నచ్చింది అండి, సహజంగా నటించడంలోనే కాదు, వ్యక్తులను గౌరవించడంలో కూడా మీ హీరో గారు చాలా పద్ధతిగా ఉన్నారండీ’ అంటూ రామోజీరావు గారు అన్నారట.

రామోజీరావు గారు చెప్పిన మాటలను కోట గారు, ఆ తర్వాత శ్రీకాంత్ కి చెప్పారు. అంటే సినిమా సెట్ లో ఒక హీరోని చుట్టూ ఉన్న వ్యక్తులే కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారని, అందుకే హీరోగా ఉన్నంత కాలం చాలా జాగ్రత్తగా ఉండాలని శ్రీకాంత్ ఆ రోజే నిర్ణయించుకున్నారట. అప్పటి నుంచి నేటి వరకు శ్రీకాంత్ తన సినిమాల విషయంలో అలాగే తన ప్రవర్తనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.