Srija out of Bigg Boss 9: నిన్నటి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఎపిసోడ్ లో గత రెండు వారాల్లో ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ దమ్ము రీ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరు హౌస్ లో ఉంటారేమో అని అంతా అనుకున్నారు కానీ, ఎవరో ఒకరు మాత్రమే ఉంటారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు అనొచ్చు. అయితే ఆ తర్వాత వీళ్లిద్దరికీ హౌస్ నుండి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు?, వీరిలో ఉన్న మైనస్సులు ఏంటి?, వాళ్ళు మార్చుకోవాల్సినవి ఏంటి? అని హౌస్ మేట్స్ నుండి సలహాలు ఇవ్వమని అంటాడు బిగ్ బాస్. భరణి కి దాదాపుగా పది మంది కంటెస్టెంట్స్ సలహాలు ఇస్తారు, శ్రీజ కి కేవలం ముగ్గురు మాత్రమే సలహాలు ఇస్తారు. ఇదంతా పక్కన పెడితే ఎపిసోడ్ చివర్లో శ్రీజ, భరణి లకు ఒక టాస్క్ ని నిర్వహిస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భరణి కి సపోర్టుగా ఇమ్మానుయేల్, నిఖిల్ ఉంటారు.
అదే విధంగా శ్రీజ కి సపోర్టుగా గౌరవ్, డిమోన్ పవన్ ఉంటారు. వీళ్ళ మధ్య భీకరమైన పోరు జరిగింది. ఎవరు ఈ టాస్క్ లో గెలిచారు అనేది పక్కన పెడితే, ఈ టాస్క్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బాగా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా సెకండ్ రౌండ్ లో భరణి దారుణంగా స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం తో ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వెంటనే బిగ్ బాస్ టీం మెయిన్ డోర్ నుండి భరణి ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆయనకు చికిత్స అందించి, శరీరం లో ఎక్కడైనా ఫ్రాక్చర్స్ జరిగాయా లేదా అని టెస్టులు నిర్వహించారు. దాదాపుగా ఇక భరణి తిరిగి వచ్చే అవకాశమే లేదు, శ్రీజ హౌస్ లో కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ భరణి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేసాడు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అయితే భరణి ఈ వారం టాస్కులు ఆడే అవకాశాలు లేనందున బిగ్ బాస్ టీం హాట్ స్టార్ లో ఆడియన్స్ ఓటింగ్ పెట్టింది. హాట్ స్టార్ లోకి వెళ్లి ‘బిగ్ బాస్ తెలుగు 9’ అని సెర్చ్ చేసి, అందులోకి వెళ్లిన తర్వాత క్రింద ‘ఫ్యాన్ జోన్’ అనే బ్లాక్ ని క్లిక్ చేసి శ్రీజ దమ్ము లేదా భరణి ఎవరు హౌస్ లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారో, వాళ్లకు ఓట్లు వేయమని బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ చివర్లో చెప్తాడు. ఈ ఓటింగ్ లో భరణి కనీవినీ ఎరుగని రేంజ్ లీడింగ్ తో కొనసాగుతున్నాడని టాక్. సోషల్ మీడియా పోలింగ్ లో కూడా భరణి కి దరిదాపుల్లో కూడా లేదు శ్రీజ. భరణి ఫ్యాన్స్ తో పాటు తనూజ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్, రాము రాథోడ్ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ ఇలా అందరి ఫ్యాన్స్ ఏకపక్షంగా భరణి కి ఓట్లు గుద్దుతున్నారు. అందుకే ఆయన టాప్ స్థానం లో ఉన్నాడు కాబట్టి, ఈ వారం ఆయన స్థానం బిగ్ బాస్ హౌస్ లో శాశ్వతం కానుంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.