Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గ్లామర్ డాల్ గా అవతరించారు. నటిగా కంటే కూడా మోడల్ గా పేరు తెచ్చుకుంటుంది. సాలిడ్ అందాల జాన్వీకి గ్లామర్ ఫీల్డ్ లో భారీ మార్కెట్ ఉంది. పలు ఫోటో షూట్స్ లో ఆమె పాల్గొంటూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో జాన్వీని 21 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గ్లామర్ పవర్ ఏమిటో. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారానే పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది.
తాజాగా జాన్వీ బ్లాక్ అవుట్ ఫిట్ లో క్లీవేజ్ షో చేసింది. జాన్వీ పరువాల బరువు మోయలేక డ్రెస్ ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది. జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు మెంటల్ తెప్పిస్తున్నాయి. ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు జాన్వీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దీంతో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. దేవర నుండి జాన్వీ లుక్ యూనిట్ విడుదల చేశారు. లంగా ఓణీలో ఆసక్తిరేపేలా ఆమె లుక్ ఉంది. తాజా సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపిస్తారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది.
దశాబ్దాల అనంతరం ఎన్టీఆర్, శ్రీదేవి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి మూవీ చేస్తున్నారు. ఇదొక విశేషం అని చెప్పొచ్చు. కాగా 2018లో విడుదలైన దఢక్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యారు. ఈ మూవీ విడుదల కాకముందే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారు. సిల్వర్ స్క్రీన్ పై కూతురిని చూసుకోవాలన్న శ్రీదేవి కల నెరవేరలేదు. ఈ ఐదేళ్ల కెరీర్లో జాన్వీ ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా చేశారు. దేవర ఆమె చేస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ.
View this post on Instagram