Pawan Kalyan- Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ నేమ్. ఆయన సినిమాలో అవకాశం రావడం అంటే సదరు హీరోయిన్ దశ తిరిగినట్లే. ఆయన సినిమాలకు భారీ రీచ్ ఉంటుంది. కాబట్టి హీరోయిన్స్ కి మంచి ఫేమ్ వస్తుంది. పవన్ వంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ ఎవరూ వదులుకోరు. అయితే ఒక స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కే ఝలక్ ఇచ్చిందట. మొదట డేట్స్ కేటాయించి తర్వాత నా వల్ల కాదని తప్పుకుందట. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో. సముద్ర ఖని దర్శకుడిగా ఉన్నారు. తమిళ్ హిట్ వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కుతుంది. కెరీర్లో మొదటిసారి సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరి మల్టీస్టారర్ గా బ్రో తెరకెక్కుతుంది. కథ రీత్యా ఓ మంచి ఐటెం సాంగ్ ని సెట్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా కసరత్తే జరిగింది. శ్రీలీల, రకుల్ ప్రీత్ పేర్లు మేకర్స్ పరిగణలోకి తీసుకున్నారట. శ్రీలీల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ డేట్స్ కుదరక ఆఫర్ వదులుకుందట.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అని సైన్ చేసిందట. తీరా షూటింగ్ కి సమయం దగ్గరపడ్డాక ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. చేసేదేమీ లేక ఆమె స్థానంలో ఊర్వశి రాతెలాను తీసుకొచ్చారట. ప్రత్యేకంగా నిర్మించిన పబ్ సెట్లో ఊర్వశి రాతెలా, పవన్ కళ్యాణ్ మీద ఐటమ్ సాంగ్ షూట్ చేశారట. ఊర్వశి రాతెలా సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో ఐటెం సాంగ్ చేసింది. పవన్ కళ్యాణ్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది.
ఇక ఐటెం సాంగ్ చేస్తానని చెప్పి మధ్యలో తప్పుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తీరుకు యూనిట్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. బ్రో షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. మరో ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. కేవలం నాలుగు నెలల్లో బ్రో మూవీ షూటింగ్ పూర్తి చేశారు. జులై 28న బ్రో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భీమ్లా నాయక్ అనంతరం పవన్ నుండి వస్తున్న చిత్రం బ్రో.