Janhvi Kapoor: స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ కొడుకు లేదా కూతురు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే వాళ్ళు చాలా లక్కీ అని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ వాళ్లకి ఉన్న ఒత్తిడులు ఎవరికీ ఉండవు అనే చెప్పాలి..బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఉండే అంచనాలు అలాంటివి..బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోలు కానీ..స్టార్ హీరోయిన్లు కానీ అయిపోలేదు..వాళ్లకి కూడా టాలెంట్, హార్డ్ వర్క్ మరియు లక్ ఉండాలి..అప్పుడే ఇండస్ట్రీ లో నెగ్గుకు రాగలరు.

సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాన్వీ కపూర్ విషయం లో జరుగుతుంది..అతిలోక సుందరి శ్రీదేవి గారి పెద్ద కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, అందం ,నటన, క్రేజ్ అన్ని ఉన్నా కూడా ఆమెకి ఇప్పటి వరుకు బ్లాక్ బస్టర్ హిట్ దక్కలేదు..అందరి హీరోయిన్స్ లాగ కాకుండా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అయితే తెచ్చుకుంది కానీ..కమర్షియల్ సక్సెస్ మాత్రం లేదు.
ఇప్పుడు ఆమె తన ఆశలన్నీ కూడా ఈ వారం లో విడుదల అవ్వబోతున్న ‘మిల్లి’ అనే చిత్రం పైనే ఉన్నది..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘హెలెన్’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ముత్తుకుట్టి దర్శకత్వం వహించగా సన్నీ కౌశల్, మనోజ్ పహ్వ ముఖ్య పాత్రలు పోషించారు..ఈ సినిమా విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది..ఈ ప్రొమోషన్స్ లో ఆమె ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో ఎంత కష్టాలు పడిందో చెప్పుకొచ్చింది.

మూసివేయబడ్డ ఒక కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకున్న అమ్మాయి..తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది..ఈ సినిమా కథాంశం అదే..చూసే ప్రతి ప్రేక్షకుడికి చాలా గొప్పగా అనిపిస్తుంది..నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమాగా ఇది నిలిచిపోతుంది అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్..ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో ఆమె పడిన కష్టాలు వింటే పాపం అనుకోవాల్సి వస్తాది..ఈ సినిమా షూటింగ్ ని 20 రోజుల పాటు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉన్న కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో తెరకెక్కించారని..షూటింగ్ జరుగుతున్నా సమయం లో చాలా శారీరక ఇబ్బందులకు గురైయ్యాను అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా చాలా చలిగా ఉండేదని..ఒళ్ళు నొప్పులు చాలా తీవ్రముగా ఉండేదని..ఈ సినిమా చేస్తున్నని రోజులు మానసికంగా మరియు శారీరకంగా చాలా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్..ఇంత కష్టపడిన తర్వాత మా సినిమా ఔట్పుట్ చూసిన తర్వాత పడిన ఆ కష్టం మొత్తం మర్చిపోయాను..ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను అని జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.