Sridevi : చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారంను వినియోగించుకుంటున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా తమ కెరియర్ను మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రతిభ వెలుగులోకి వచ్చింది. టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి భారీ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. ఆ వచ్చిన క్రేజ్ తో వీళ్ళు రియాలిటీ షో అయినా బిగ్ బాస్ లో కూడా పాల్గొనే అవకాశం అందుకుంటున్నారు. అలాగే మరి కొంతమంది టిక్ టాక్ వీడియోల ద్వారా, రీల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాలలో కూడా నటించే అవకాశం అందుకుంటున్నారు.
Also Read : ఒకప్పటి స్టార్ హీరోయిన్..42 ఏళ్ల వయసులో అవకాశాలు రాక ఇలా…
ఇలా సినిమాలలో హీరోయిన్ గా చేసిన వాళ్లు కొంతమంది తమ కెరియర్ ప్రారంభంలో రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన వాళ్లే. ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్ వి, ఆర్జీవి శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 లో నటించిన ఆంచల్ ముంజాల్ అలాగే ఏజెంట్ సినిమా హీరోయిన్ సాక్షి వైద్య వీళ్ళందరూ కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన వాళ్ళు. ప్రస్తుతం ఈ జాబితాలోకి మరో బ్యూటీ కూడా చేరింది. ఇంస్టాగ్రామ్ రూల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ చిన్నది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది. ఈమె నటించినా తొలి సినిమా ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ కాకినాడ అమ్మాయి పేరు శ్రీదేవి. కోర్టు సినిమా హీరోయిన్ గా శ్రీదేవి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన అమ్మాయి.
ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసిన ఒక రీల్ చూసి ఈమెకు కోర్టు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని కోర్టు సినిమా దర్శకుడు రామ్ జగదీశ గతంలో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆడిషన్స్ సమయంలో కూడా శ్రీదేవి ఏమాత్రం తడబాటు లేకుండా పర్ఫెక్ట్ గా డైలాగులు చెప్పడంతో ఆమెను ఏమాత్రం సందేహించకుండా కోర్టు సినిమాలో జాబిలి పాత్ర కోసం ఫైనల్ చేసినట్టు కోర్టు సినిమా మేకర్స్ చెప్పుకొచ్చారు. తన కెరియర్ తొలినాళ్లలో శ్రీదేవి ఇంస్టాగ్రామ్ రూల్స్ ద్వారా బాగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఈ బ్యూటీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక శ్రీదేవి నటించిన కోర్టు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించి ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
