Krishna Vrinda Vihari: ‘ఏముంది రా’.. బ్యూటీఫుల్ లైఫ్ ను ఊహించుకుంటున్న నాగశౌర్య !

Krishna Vrinda Vihari: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రసుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని “కృష్ణ వ్రింద విహారి” సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ‘ఏముంది రా’ అనే లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను బాగా ఆక‌ట్టుకుంటోంది. త‌న ప్రియురాలితో […]

Written By: Shiva, Updated On : May 4, 2022 5:28 pm
Follow us on

Krishna Vrinda Vihari: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రసుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని “కృష్ణ వ్రింద విహారి” సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ‘ఏముంది రా’ అనే లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను బాగా ఆక‌ట్టుకుంటోంది. త‌న ప్రియురాలితో బ్యూటీఫుల్ లైఫ్ ను ఊహించుకుంటూ హీరో పాడుకునే ఈ పాటలో మంచి ఫీల్ ఉంది.

Krishna Vrinda Vihari MOVIE

‘ఏముందిరా ఈ అద్బుతాన్ని చూడు.. మారిందిరా అందం చ‌రిత్ర నేడు..
అమ్మాయిలా.. అమ్మో ఇంత గొప్ప మాయ‌లా..
ఏముందిరా పూవ్వ‌ల్లే తార చేత చెక్కిందిరా..
క‌ళ్లార చూసుకున్న ధ‌న్యోస్మి రా..త‌నందాన్ని క‌ళ్ల‌క‌ద్ద‌రా..’ అంటూ హీరోయిన్ అందాన్ని వ‌ర్ణిస్తూ సాగిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: Chiranjeevi- Sridevi Remuneration: శ్రీదేవి 20 అడిగితే.. చిరంజీవి మరో 15 ఎక్కువ అడిగారు

సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన ఈ పాట మంచి వైబ్ లో సాగింది. గుడ్ లిరిక్స్ తో పాటు బెటర్ విజువల్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. పైగా రొమాన్స్ పాళ్లు ఎక్కువ శాతంతో సాగిన ఈ టీజర్ ఎంటర్టైనర్ గా అనిపించింది. హీరో.. హీరోయిన్ ప్రేమ కోసం పడే ఆరాటం దగ్గర నుంచి.. అతన్ని చూడగానే ఆమె చూపించే అలకలు వరకూ.. అలాగే మధ్యలో హీరో బుజ్జగింపులు కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.

Krishna Vrinda Vihari

ఇప్పుడు ఈ పాట కూడా బాగుండేసరికి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. యువ సంగీత దర్శకుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగుంది. కాగా ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు.

నాగ‌శౌర్యకు జోడిగా షిర్లే సేటియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు యంగ్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలని కోరుకునే హీరో ‘నాగశౌర్య’. మరి ఈ సినిమాతో హిట్ కొడతాడా ? చూడాలి.

Also Read:NTR- SS Rajamouli: ఎన్టీఆర్‌ ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు ?

 

Tags