https://oktelugu.com/

Renu Desai In Ravi Teja Movie: రవితేజతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాజీ భార్య‌ !

Renu Desai In Ravi Teja Movie: పవర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాజీ భార్య‌గా ‘రేణు దేశాయ్’ మళ్లీ నటించడానికి రెడీ అయిందని గతంలోనే అనేక వార్తలు వచ్చాయి. కాగా తాజాగా రవితేజ సినిమాలో నటిస్తోంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకెవెళుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసి ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’ సినిమాలను కూడా లైన్‌లో పెట్టారు. అయితే వంశీ కృష్ణ దర్శకత్వంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 01:05 PM IST
    Follow us on

    Renu Desai In Ravi Teja Movie: పవర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాజీ భార్య‌గా ‘రేణు దేశాయ్’ మళ్లీ నటించడానికి రెడీ అయిందని గతంలోనే అనేక వార్తలు వచ్చాయి. కాగా తాజాగా రవితేజ సినిమాలో నటిస్తోంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకెవెళుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసి ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’ సినిమాలను కూడా లైన్‌లో పెట్టారు.

    Renu Desai In Ravi Teja Movie

    అయితే వంశీ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సిస్టర్ రోల్ కోసం రేణు దేశాయ్‌ ను తీసుకోవాలని దర్శకుడు చూస్తున్నట్లు సమాచారం. ఇక రేణు దేశాయ్ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారు. అయితే, గత కొంతకాలంగా ఆమె నటన పై ఫుల్ ఫోకస్ పెట్టిందట. అన్నట్టు రేణు దేశాయ్ ప్రస్తుతం ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

    Also Read: ఆమె విషయంలో బాలయ్యకు 3 కండీష‌న్లు పెట్టిన ఎన్టీఆర్ !

    మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్ ను ఆమె గ్రాండ్ గా ప్రారంభిస్తోంది. మరి రేణు దేశాయ్ తన రీ ఎంట్రీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆమె చేస్తోంది పాన్ ఇండియా సినిమా కదా. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా ఆమెది కీలక పాత్ర అట. మరి ఈ సినిమాలతో ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు వస్తోందో చూడాలి.

    మొత్తానికి మ‌ళ్లీ ఎలాగైనా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని రేణుదేశాయ్ ఎన్నాళ్ల‌గానో ప‌రిత‌పిస్తోంది. మరోపక్క బుల్లితెర పై షోలలో జడ్జ్ గా కూడా అందర్నీ అలరిస్తోంది. అప్పుడ‌ప్పుడు డాక్యుమెంట‌రీలు కూడా చేస్తూ ఒక సినిమా కూడా డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది.

    Also Read: సినిమా మొదలయ్యాక శ్రీహరి మరణం.. జ‌గ‌ప‌తి బాబు వ‌ద్ద‌కు క్యారెక్ట‌ర్.. ఆయ‌న ఏమ‌న్నారంటే..?

    Tags