https://oktelugu.com/

Varun Tej: వరుణ్ తేజ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

లావణ్యను మినహాయించి మరో హీరోయిన్ గురించి అడిగితే సాయి పల్లవి అని సమాధానం చెప్పారు. అంతేకాదు మంచి కథ దొరికితే పవన్ తో సినిమా చేస్తానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి సినిమా ఇదేనేమో అంటూ ఆపరేషన్ వాలంటైన్ గురించి వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 7, 2024 / 02:35 PM IST
    Follow us on

    Varun Tej: వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముకుంద సినిమా తో మంచి పేరు సంపాదించిన ఈ హీరో ఎన్నో సినిమాల్లో నటించారు.అన్ని సినిమాల కంటే ఫిదా సినిమా సూపర్ హిట్ ను అందించింది. కానీ ఈ మధ్య సరైన సక్సెస్ లేకపోవడంతో చాలా కష్టపడుతున్నారు వరుణ్. కానీ ఆయన కష్టానికి సరైన ఫలితం దక్కడం లేదని బాధ పడుతున్నారు ఆయన అభిమానులు.

    అయితే ఈయన నటించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి నెల 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ తో చిత్రయూనిట్ ముచ్చటించింది. ఒక విద్యార్థి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడగగా..దానికి సమాధానం ఇస్తూ.. నా ఫేవరేట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నానని అంటూ లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు మంచి కథలు ఉంటే లావణ్యతో కలిసి నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వరుణ్.

    ఇక లావణ్యను మినహాయించి మరో హీరోయిన్ గురించి అడిగితే సాయి పల్లవి అని సమాధానం చెప్పారు. అంతేకాదు మంచి కథ దొరికితే పవన్ తో సినిమా చేస్తానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి సినిమా ఇదేనేమో అంటూ ఆపరేషన్ వాలంటైన్ గురించి వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. కామెడీలు వంద చేయవచ్చని అయితే దేశం కోసం ఏం చేసినా గొప్పగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. నా తర్వాత మూవీ మట్కా మాస్ మూవీగా తెరకెక్కుతోందని అన్నారు వరుణ్.

    గద్దలకొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. తర్వాత సినిమాలతో కూడా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ హిట్లను అందుకుంటారేమో చూడాలి. వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినిమాలు ఈ మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.