Sreemukhi: శ్రీముఖి టైం మాములుగా లేదు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. అనసూయ, రష్మీలను సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. శ్రీముఖి యాంకర్ గా నాలుగైదు బుల్లితెర షోస్ ఉన్నాయి. ఓటీటీలో కూడా అల్లాడిస్తుంది భామ. ఆహా లో డాన్స్ ఐకాన్ పేరుతో రియాలిటీ షో ప్రసారం అవుతుంది. ఓంకార్ యాంకర్ గా ఉన్న ఈ షోలో శ్రీముఖి హాట్ నెస్ హద్దులు దాటేస్తుంది. పొట్టిబట్టల్లో విపరీతమైన స్కిన్ షో చేస్తుంది. ఓటీటీకి సెన్సార్ పరిమితులు పెద్దగా ఉండవు. దీంతో రెచ్చిపోతుంది అమ్మడు.

హాట్ ట్రెండీ వేర్స్ లో బోల్డ్ నెస్ కి తెరలేపుతున్న శ్రీముఖి పంథా మార్చారు. నిండైన చీరలో ముద్దుగుమ్మలా తయారయ్యారు. స్కై బ్లూ శారీ, పింక్ బ్లౌజ్ ధరించి ముగ్ద మనోహరం గా కనిపించారు. సాలిడ్ అందాల శ్రీముఖి సంప్రాదాయ కట్టులో కూడా కిక్ ఇచ్చేలా ఉంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ శ్రీముఖి అందాల జడిలో తడిసి ముద్దవుతున్నారు. ఇక కామెంట్స్ రూపంలో తమ అభిమానం చాటుకుంటున్నారు.
ఈ మధ్య ఏ ఛానల్ లో చూసినా శ్రీముఖినే. అనసూయ, రష్మీ, సుమ సందడి తగ్గిన నేపథ్యంలో శ్రీముఖి దూసుకుపోతుంది. అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్లు కనిపిస్తుండగా శ్రీముఖికి కలిసొస్తుంది. ప్రస్తుతమున్న యాంకర్స్ లో ఎక్కువ షోస్ శ్రీముఖి చేతిలో ఉన్నాయి. మరోవైపు హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన వెండితెర ఆఫర్స్ కాదనకుండా చేసుకుపోతున్నారు.

శ్రీముఖి చాలా తక్కువ సమయంలో ఫేమ్ తెచ్చుకున్నారు. పటాస్ కామెడీ షోతో యాంకర్ గా మారిన శ్రీముఖి ఆరంగేట్రంతోనే సత్తా చాటింది. పటాస్ షోతో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి టైటిల్ కోసం పోటీపడ్డారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కాగా రన్నర్ శ్రీముఖి. రాహుల్ కి సింపతీ వర్క్ అవుట్ కావడంతో టైటిల్ కొట్టేశాడు. శ్రీముఖి ఓడినప్పటికీ భారీగా రెమ్యూనరేషన్ రాబట్టినట్లు సమాచారం.

యాంకర్ గా,నటిగా కొనసాగుతూనే శ్రీముఖి వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. ఏడాదికి శ్రీముఖి భారీగానే ఆర్జిస్తున్నారు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో శ్రీముఖి క్యాస్టింగ్ కౌచ్ వంటి వేధింపులు ఎదుర్కొన్నారట. అవన్నీ తట్టుకొని పరిశ్రమలో నిలదొక్కుకున్నట్లు శ్రీముఖి ఓ సందర్భంలో చెప్పారు.