
‘యాంకర్ శ్రీముఖి’ గొంతు గురించి ఎంత ముచ్చట్టించుకున్నా అది తక్కువే అవుతుందని నెటిజన్లు కామెంట్స్ తో శ్రీముఖి పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తుంటారు. ఏమైనా బుల్లితెర రాములమ్మగా, బిగ్ బాస్ లౌడ్ స్పీకర్ గా శ్రీముఖి బాగానే క్రేజ్ సంపాదించుకున్నా.. ఒక్కోసారి ఆమె వాయిసే ఆమెను తెగ బాధ పెడుతుంది. శ్రీముఖి నోరు తెరిచిందంటే చాలు సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే అనే విమర్శలకు కూడా ఈ బబ్లీ బ్యూటీ తెగ ఫీల్ అవుతుందట. దీనికితోడు శ్రీముఖి వాయిస్ పై వచ్చినన్నీ మీమ్స్, ట్రోలింగ్స్ మరేతర యాంకర్ల పై రాలేదు అంటే.. శ్రీముఖి గొంతు స్టామినాని అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్తగా శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!
తన వాయిస్ వల్ల శ్రీముఖికి ఏకంగా లౌడ్ స్పీకర్ అంటూ బిగ్ బాస్‌లో ఓ అవార్డును కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా శ్రీముఖి వాయిస్ ఇప్పటికీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతూ సెటైర్లకు గురవుతూ ఉంది. అయితే, తాజాగా శ్రీముఖి వాయిస్ పై వచ్చిన ఓ మీమ్‌ను చూసి.. శ్రీముఖి తెగ ఫీల్ అయి మొత్తానికి చేతులెత్తి దండం పెట్టేసింది. ఇంతకీ ఆ సెటైర్ ఏమిటంటే.. డార్లింగ్ సినిమాలో చంద్రమోహన్ తో, ప్రభాస్ సీన్ ను మీమ్ గా ఎడిట్ చేశారు. ‘మైక్, స్పీకర్స్ లేకుండా అందరికీ వినిపించేలా మాట్లాడే ఓ యాంకర్ కావాలి’.. అని ప్రభాస్ అడిగితే, ‘అయితే శ్రీముఖిని యాంకర్‌గా పెట్టుకుందాం అని’ చంద్రమోహన్ చెప్పినట్టు మీమ్‌లో ఎడిట్ చేసి పెట్టారు.
Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!
పైగా ‘అదీ శ్రీముఖి వాయిస్ అంటే’.. అని చివర్లో ఓ ఫన్నీ సెటైర్ కూడా వేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ మీమ్ చివరకు శ్రీముఖి దగ్గరకు చేరింది. మీమ్ ను చూసిన శ్రీముఖి ‘నమస్కారం’ అంటూ మొత్తానికి ఈ మీమ్ ఓ దండం పెట్టేసింది. ఏది ఏమైనా అందరూ తనను లౌడ్ స్పీకర్ అని ఎగతాళి చేస్తున్నా శ్రీముఖి మాత్రం తన అరుపులను కేకలను మానుకోవడం లేదు. ‘బొమ్మ అదిరింది’ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఆమె చేస్తోన్న రచ్చ గురించి కామెంట్స్ చేయడానికి నెటిజన్లు కూడా భయపడుతున్నారు. ఇంతకీ శ్రీముఖి తన అరుపులను ఎప్పుడూ కంట్రోల్ చేసుకుంటుందో చూడాలి.
