Mahesh Babu – Ram Charan : మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు కావడం వాటికి మంచి క్రేజ్ ఉండడం నిజంగా ఒక రకంగా గ్రేట్ అనే చెప్పాలి.
చిరంజీవి రామ్ చరణ్ ను ఎలాగైతే చూడాలి అనుకున్నాడు ప్రస్తుతం రామ్ చరణ్ అంతటి స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ ను చూస్తూ పుత్రోత్సాహం పొందుతున్నాడనే చెప్పాలి. ఇక బాలీవుడ్ హీరోలను సైతం డామినేట్ చేస్తూ తను ఎదుగుతున్న తీరు అమోఘమనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్టులన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు లు కావడం, దానికి తోడుగా ఆయన స్టార్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయడం అనేది రామ్ చరణ్ కి బాగా కలిసొచ్చే అంశం అనే చెప్పాలి…
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి అందగాడని ఇండస్ట్రీలో ఉన్న ఎవరు కూడా ఆయన అందాన్ని మ్యాచ్ చేయలేరని ఆయన అందం లో కొంచెం మాకు కూడా ఇస్తే బాగుంటుందని నవ్వుకుంటూ అన్నాడు. నిజానికి మహేష్ బాబు మిల్క్ బాయ్ లా ఉంటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం లో అందగాడు ఎవరు అంటే ఎవరైనా చెప్పే ఒకే ఒక్క మాట మహేష్ బాబు. ఆయన లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ వరల్డ్ ను షేక్ చేయాలని దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజమౌళి తో కలిసి ఆ సినిమా మేకవర్ లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…