‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతి లాంటి లేడీ అమితాబే ఆమెకు కితాబు ఇచ్చింది అంటే శ్రీముఖిలో ఎంత మ్యాటర్ ఉండి ఉండాలి. కానీ, శ్రీముఖి మాత్రం ఎప్పుడు తనలోని మ్యాటర్ కి తగ్గట్టు బిహేవ్ చేయలేదు. వజ్రాల కురిసే సినీ తెరను వదిలేసి చిల్లర రాలుతున్న బుల్లితెర పై అడ్డమైన స్కిట్లు చేస్తూ తనకు తానే తన స్థాయిని తగ్గించుకుంది ఈ స్టార్ యాంకర్.
అయితే తాజాగా శ్రీముఖి ఓ షోలో పాల్గొని అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్ కు ఐ లవ్ యూ అంటూ సిగ్గు లేకుండా డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది. మరి ఇది స్కిటులో భాగమా ? లేక నిజంగానే శ్రీముఖి తన మనసులోని ఆరాటాన్ని ఇలా పబ్లిక్ ముందు కక్కేసిందా ? అయితే, ఇక్కడ విచిత్రంగా శ్రీముఖి ప్రపోజల్ కి ప్రదీప్ కూడా సరే అన్నట్లుగా తెగ సిగ్గు పడిపోయాడు.
మరి ఆమెగారి బరితెగింపు ప్రపోజల్ కి ఇతగాడి లోలోపల సిగ్గు ఒగ్గులకు అసలు సింక్ అవుతుందా ? అన్నదే ఇక్కడ డౌట్. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా భవిష్యవాణి పై పడ్డారు. ఎవరికీ తొంచింది వాళ్ళు చెబుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారిలా ఫీల్ అయిపోతున్నారు.
వీరి జోడీ బాగుంటుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇదంతా కేవలం షో కోసమే శ్రీముఖి ఇలా చేసింది అనే అనుమానం కూడా ఉంది. టీఆర్పీ రేటింగ్ కోసం గతంలో ఏకంగా పెళ్లి కూడా అయిపోయింది అన్నట్టు ప్రోమోలు కట్ చేసి వదిలిన ప్రొడక్షన్ హౌస్ లు మనకు ఉన్నాయి. కాబట్టి.. శ్రీముఖి – ప్రదీప్ ల ప్రేమ వ్యవహారం అనేది సీరియస్ కాదు అనే అనుకోవాలి.