Leo Collections: టాక్ తో సంబంధం లేకుండా కుమ్మేస్తున్న లియో… 6 రోజుల్లో విక్రమ్ రికార్డు అవుట్!

లియో 5వ రోజు రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ అన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో రూ.125 కోట్లు, ఏపీ/తెలంగాణాలలో రూ. 34 కోట్లు, కేరళలో రూ. 40 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్ల వసూళ్లు అందుకుంది.

Written By: NARESH, Updated On : October 25, 2023 1:54 pm

Leo Collections

Follow us on

Leo Collections: లోకేష్ కనకరాజ్-విజయ్ సెకండ్ కొలాబిరేషన్ లియో. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. ఫస్ట్ షో నుండి లియో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. టెక్నికల్ గా, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నా… కంటెంట్, స్క్రీన్ ప్లే మెప్పించలేదన్న వాదన వినిపించింది. విజయ్ యాంటీ ఫ్యాన్స్ మరింతగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయితే అవేమీ సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపలేదు. లియో 6 రోజుల్లో వందల కోట్ల వసూళ్లు సాధించింది.

లియో 5వ రోజు రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ అన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో రూ.125 కోట్లు, ఏపీ/తెలంగాణాలలో రూ. 34 కోట్లు, కేరళలో రూ. 40 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇక ఓవర్సీస్ లో రూ. 160 కోట్ల వసూళ్లు అందుకుంది. మొత్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ లియో కొల్లగొట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో లియో క్లీన్ హిట్ గా నిలిచింది. ఏపీ/తెలంగాణాలలో రూ. 20 కోట్ల షేర్ అందుకుంది. ఇక్కడ లియో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. విజయ్ కెరీర్లో హైయెస్ట్ వసూళ్లు లియోతో నమోదు అయ్యాయి. వరల్డ్ వైడ్ లియో రూ. 210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చాలా ఏరియాల్లో లియో ప్రాఫిట్ జోన్లో కి ఎంటర్ అయ్యింది. నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు ఏ హీరోకి సాధ్యం కావేమో..

లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది. ఖైదీ, విక్రమ్ ఈ సిరీస్లో భాగంగా ఉన్నాయి. లియో పతాక సన్నివేశాల్లో దీనికి సంబంధించిన సన్నివేశాలు జోడించారు. విజయ్ కి జంటగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.