Sreeleela: ఒక్క సినిమా కూడా హిట్ లేకుండా యంగ్ హాట్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో లక్కీ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు, ఒకే బ్యానర్ లో శ్రీలీల ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసింది. తమిళ నిర్మాత కళానిధి మారన్ తన సన్ ప్రొడక్షన్స్ లో వరుసగా మీడియం రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. హీరో విశాల్ దగ్గర నుంచి కన్నడ స్టార్ దర్శన్ వరకు హీరోలను ఫైనల్ చేసుకున్నాడు.

వీరి పక్కన మెయిన్ హీరోయిన్ మరొకరు ఉన్నా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం తెలుగు బ్యూటీ శ్రీ లీలను ఫైనల్ చేసుకున్నాడు. ఇక్కడే సమ్ థింగ్ స్పెషల్ అంటూ అరవం మీడియాలో సిల్లీ కథనాలు వైరల్ అవుతున్నాయి. శ్రీ లీల బిజీ హీరోయిన్ కాదు, పైగా తమిళంలో మార్కెట్ ఉన్న పర్సనాలిటీ కాదు, మరి ఎందుకు ఆమె ఖాతాలో కళానిధి మారన్ మూడు సినిమాలు వేశాడు ?.
అసలు కళానిధి మారన్ కి – శ్రీ లీల కి ఎక్కడ లింక్ కుదిరింది ?, శ్రీ లీలను ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు ఇదే హాట్ టాపిక్. శ్రీ లీల ఆ మధ్య చెన్నైలోనే నెల రోజుల పాటు ఉంది. ఆ సమయంలో శ్రీ లీల ఎలాంటి షూట్ లో పాల్గొనలేదు. మరి ఆ నెల రోజులు శ్రీ లీల ఏం చేసింది ?, ఆ సమయంలో కళానిధి మారన్ కూడా ఎలాంటి సినిమాల పని పెట్టుకోలేదు. పైగా ఆయన అప్పుడు రిలాక్స్ మూడ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి.

అందుకే, శ్రీ లీల వరుస అవకాశాలు వచ్చాయా ?, పైగా తమిళ ఇండస్ట్రీలో వరుస ఛాన్స్ లు ?, ఈ మతలబుకు అసలు కారణం కళానిధి మారనే. కళానిధి మారన్ కి శ్రీ లీల పెర్ఫామెన్స్ బాగా కనెక్ట్ అయ్యిందట. అందుకే, శ్రీ లీలకు వరుస ఆఫర్లు ఇచ్చాడట. మొత్తానికి శ్రీ లీల సినిమాల లిస్ట్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో శ్రీ లీల కు ఓ సినిమా ఉంది.
హీరో రామ్ హీరోగా మొదలయ్యే ఈ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, ఇంకా సెట్ మీదకు వెళ్లని హీరో వరుణ్ తేజ్ సినిమాలో కూడా శ్రీ లీల ఓ హీరోయిన్ అలరించనుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో ఏకంగా మూడు తమిళ సినిమాలు పడబోతున్నాయి. వీటిల్లో ఏదీ హిట్ అయినా అమ్మడు రేంజ్ మారిపోయినట్టే.