https://oktelugu.com/

Sreeleela: సీనియర్ ఎన్టీఆర్ ని ఘోరంగా అవమానించిన శ్రీలీల..మండిపడుతున్న నందమూరి ఫ్యాన్స్..వైరల్ అవుతున్న వీడియో!

శ్రీలీల స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు శ్రీలీల పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీదనే శ్రీలీల భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్ అయితే మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ హిట్ కాకుంటే ఆమె పని అయిపోయినట్టే, ఎందుకంటే ఆమెకు పోటీ గా భాగ్యశ్రీ భోర్సే అనే కొత్త హీరోయిన్ వచ్చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 01:21 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela: టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే ఈమె తన అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రెండవ సినిమా ‘ధమాకా’ తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల వేసిన డ్యాన్స్ అని ఇప్పటికీ అందరూ బలంగా నమ్ముతారు. ఈ చిత్రం తర్వాత ఆమె అరడజనుకి పైగా సినిమాలు చేస్తే అందులో ఫ్లాప్ అయినా చిత్రాలు 90 శాతం పైనే ఉన్నాయి. కేవలం ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రమే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది మహేష్ బాబు తో చేసిన ‘గుంటూరు కారం’ చిత్రం ఫలితం ఏంటో కూడా మనకి తెలుసు.

    అయితే ఇన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా శ్రీలీల క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఈమె నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ అనే చిత్రం లో నటిస్తుంది. వరుసగా మూడు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత నితిన్ నుండి వస్తున్న చిత్రమిది. ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వెంకీ కుడుముల తో ఆయన చేస్తున్న రెండవ సినిమా ఇది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా నితిన్ శ్రీలీల కు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ని తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేసాడు. సీనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం క్లాసిక్ హిట్ చిత్రం ‘గుండమ్మ కథ’ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం’ అనే పాటకు ఈమె డ్యాన్స్ వేస్తూ కనిపించింది. సహజం గా డ్యాన్స్ వేస్తే పర్వాలేదు. కానీ ఈమె ఆ పాటకు సంబంధం లేని స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనిని కొందరు సరదాగా తీసుకొని ఎంజాయ్ చేసినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ మాత్రం తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో విలువైన పాటకు ఇలాంటి స్టెప్పులు వేసి అవమానిస్తారా?, ప్రతీ విషయాన్నీ కామెడీ గా చేయాలని చూడకండి, మీరు సెలెబ్రిటీలు, కాస్త బాధ్యతతో వ్యవహరించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    మరి దీనికి శ్రీలీల స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు శ్రీలీల పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీదనే శ్రీలీల భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్ అయితే మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ హిట్ కాకుంటే ఆమె పని అయిపోయినట్టే, ఎందుకంటే ఆమెకు పోటీ గా భాగ్యశ్రీ భోర్సే అనే కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో దర్శక నిర్మాతల ద్రుష్టి ఈమెపై పడింది. ఒక్క సినిమా హిట్ అయినా శ్రీలీల అవకాశాలకు గండి కొట్టొచ్చు, కాబట్టి శ్రీలీల కు ఇప్పుడు భారీ హిట్ రావడం అత్యవసరం.