https://oktelugu.com/

Maruthi Ertiga : షాక్.. సేప్టీలో ఈ 7 సీటర్ కారు విఫలం.. రేటింగ్ ఇంత తక్కువనా? ఏ కంపెనీదో తెలుసా?

మారుతి నుంచి రిలీజ్ అయిన ఏ కారు అయినా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని కొందరు ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎర్టీగా 7 సీటర్ విభాగంలో అమ్మకాల్లో దూసుకుపోతుది. 7 సీటర్ అనగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. కానీ ఆ కారు కంటే ఎక్కువ ఫీచర్స్ ను అందిస్తూ తక్కువ ధరలో లభించడం వల్ల చాలా మంది ఎర్టీగా వైపు చూస్తున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2024 / 11:22 AM IST
    Follow us on

    Maruti Ertiga :  భారతదేశంలో కార్ల విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే చాలా మంది సొంత అవసరాలతో పాటు ట్రావెల్ కోసం కార్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కార్యాలయానికి ..మరికొన్ని సందర్భాల్లో విహార యాత్రలకు వెళ్లేందుకు ఉపయోగపడేలా వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా చాలా కంపెనీలు మల్టీ పర్సస్ వెహికల్ (MPV)లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి 7 సీటర్ నుంచి తొమ్మిది మంది సౌకర్యంగా ఉండేలా తయారు చేస్తున్నారు. టాటా వంటి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా 5 సీటర్ కు మించి కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఎంపీవీలో మారుతి నుంచి రిలీజ్ అయిన ‘ఎర్టీగా’ కారు నెంబర్ వన్ గా నిలుస్తోంది. 7 సీటర్ కలిగిన ఈ కారు 201లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రారంభానికి మొత్తం 10 లక్షల అమ్మకాలను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాదిలో ఎర్టీగా ‘ఎర్టీగా’ను చాలా మంది బుక్ చేసుకుంటున్నారు. విశాలమైన స్పేస్ తో పాటు ఎక్కువ మంది ప్రయాణించేలా ఉన్న ఈ కారు కోసం క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. ఈ కారులో ఉండే ఫీచర్స్ తో పాటు ఇంజిన్ సామర్థ్యం వినియోగదారులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఎర్టీగాకు సంబంధించి సేప్టీ టెస్ట్ ను చేశారు. ఈ కారు ఎంత వరకు భద్రత ఇస్తుంది? రేటింగ్ ఎంత వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    మారుతి నుంచి రిలీజ్ అయిన ఏ కారు అయినా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని కొందరు ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎర్టీగా 7 సీటర్ విభాగంలో అమ్మకాల్లో దూసుకుపోతుది. 7 సీటర్ అనగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. కానీ ఆ కారు కంటే ఎక్కువ ఫీచర్స్ ను అందిస్తూ తక్కువ ధరలో లభించడం వల్ల చాలా మంది ఎర్టీగా వైపు చూస్తున్నారు. దీంతో తక్కువ కాలంలోనే ఈ మోడల్ ఎక్కువ సేల్స్ అయ్యాయి.

    ఎర్టీగా ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇందులో 105 బీహెచ్ పీ పవర్, 134 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సాధారణంగా 7 సీటర్ కారు అనగానే రూ. 10 లక్షలకు పైగా ఉంటుంది. కానీ మారుతి ఎంపీవీ ఎర్టీగా ను రూ. 8.69 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.13.03 ధర ఉంది.

    మారుతి ఎర్టీగాను ఇటీవల గ్లోబల్ టెస్ట్ చేశారు. ఈ కారు ఎంత వరకు భద్రత ఇవ్వనుంచి అని గ్రహించారు. గ్లోబల్ NCAP టెస్ట్ ప్రకారం ఈ మోడల్ 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. అడల్ట్స్ సేప్టీలో 34 పాయింట్లకు 23.63 పాయింట్లు సాధించింది. చైల్డ్ ప్రొటెక్షన్ లో 49 పాయింట్లకు 19.40 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఇక డ్రైవర్ దిగువ కాళ్లకు గాయం అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. మొత్తంగా ఇది సేప్టీ కాదని తెలిసింది. అయితే ఆప్రికాలో విక్రయించే ఎర్టీగానే టెస్ట్ చేశారు. గత నాలుగేళ్ల కిందట ఇదే ఎర్టీగాను పరీక్షించగా 3 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ తరుణంలో ఎర్టీగా కారు ఉన్న వారి మధ్య తీవ్ర చర్చ సాగుతోంది.