https://oktelugu.com/

Bollywood: నువ్వు హీరోయిన్ అవుతావా అంటు హేళన చేశారు..కట్ చేస్తే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ గా మారింది..

వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో కొనసాగలుగుతాం. లేదంటే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన అవసరం అయితే వస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 26, 2024 / 01:49 PM IST

    Bollywood Actress Mouni Roy Reveals Unknown facts

    Follow us on

    Bollywood: నిజానికి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు ఇక్కడ ఎన్నో అవమానాలు, అంతకుమించి చీత్కారాలు, ఎన్నో వ్యతిరేక ధోరణులను ఎదుర్కొని నిలబడగలిగితే అప్పుడు సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ఒకవేళ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో కొనసాగలుగుతాం. లేదంటే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన అవసరం అయితే వస్తుంది.

    ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ అయిన ‘మౌని రాయ్’ మొదట బుల్లితెర నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయితే బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలనే ప్రాసెస్ లో ఆమెకు చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి… మొదట టెలివిజన్ లో యాంకర్ గా వ్యవహరించిన ఈమె మరికొన్ని రియాల్టీ షోలకు హోస్టుగా వ్యవహరించి తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక అప్పుడు తను ఎలాగైనా సరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తన సత్తా చాటాలని అనుకుంది. అయితే ఆమెను చూసిన చాలా మంది నువ్వు హీరోయిన్ అవుతావా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?అంటూ చాలా హేళనగా మాట్లాడేవారట. కానీ అవన్నింటినీ అధిగమిస్తూ ఎప్పటికైనా హీరోయిన్ అవ్వాలని కోరికతోనే ముందుకు సాగేది…

    ఇక తను ఎంచుకున్న మార్గంలో తను ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని కోరుతూ మొండిగా ముందుకు దూసుకెళ్లింది. దాంతో నాగిన్, డేవాన్ కే దేవ్, మహదేవ్ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె భారతదేశం లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలవడం అనేది నిజంగా ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి… ఇక ఈమె రీసెంట్ గా చేసిన ‘షో టైమ్’ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న తను ఇండస్ట్రీకి రావడానికి అలాగే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి తను పడిన ఇబ్బందులను తెలియజేసింది. తనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, ఒకానొక సమయంలో ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని అనుకున్న కూడా తను ధృడ సంకల్పం తో ముందుకు కదిలిందని చెప్పింది. అలాగే ఇక్కడ చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళను డి గ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ అవహేళనగా చూస్తారు అంటూ తన మనసులోని మాటలు కూడా చెప్పింది…

    ఇక కొంతమంది అయితే నువ్వు ఎప్పటికీ హీరోయిన్ అవ్వలేవు హీరోయిన్ అనే కల కనడం మానేసి వేరే ఏదైనా పని చేసుకుంటే బాగుంటుందని కూడా చాలామంది ఆమెను హేళన చేశారట. ఇక మొత్తానికైతే ఆమె స్టార్ హీరోయిన్ గా తనను తాను రిప్రజెంట్ చేసుకుంటూ తనను హీరోయిన్ అవ్వలేవు అని కామెంట్స్ చేసిన వారందరికీ తగిన గుణపాఠం చెప్పింది.ఇక మౌని రాయ్ దుబాయ్ లోని సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ లో ఉండి 2022 జనవరి 27 న గోవాలోని పనాజీలో పెళ్లి చేసుకున్నారు. ఇక బెంగాలీ, మలయాళీ సంప్రదాయ పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం తన షోటైమ్ లో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా ఒక హింట్ కూడా ఇచ్చింది…