Jayammu Nischayammu Raa With Jagapathi : నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో డ్యాన్స్ అద్భుతంగా వేయగల హీరోయిన్ ఎవరు అని అడిగితే మనకి గుర్తుకొచ్చే పేర్లలో ఒకటి శ్రీలీల(Sreeleela). క్లాస్, మాస్ అని తేడా లేదు, ఆమె డ్యాన్స్ ని ఎంజాయ్ చెయ్యని ప్రేక్షకుడు అంటూ ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి సినిమా పెళ్లి సందడి తోనే ఎవరు ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది అని అనుకునేవారు. కచ్చితంగా ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని కూడా అనుకున్నారు. ఊహించినట్టుగానే ఈమెకు అద్భుతమైన సినీ కెరీర్ వచ్చింది. పెళ్లి సందడి తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. సక్సెస్ రేట్ చాలా తక్కువే కానీ, క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె జీ తెలుగు లో జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయామురా అనే టాక్ షోకి ముఖ్య అతిథి గా పాల్గొంది.
ఈమెతో జగపతి బాబు జరిపిన సంభాషణ సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయ్యింది. ఈ షో లో శ్రీలీల తో పాటు సర్ప్రైజ్ గెస్ట్ గా ఆమె తల్లి కూడా హాజరైంది. ఆమె తన కూతురు శ్రీలీల గురించి చెప్పిన అనేక మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈమె వ్యాఖ్యలకు చాలా సంతోషిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ చిన్నతనం లో క్లాసిక్ డ్యాన్స్ వేసిన ఫోటోలను పైన LED స్క్రీన్ లో ప్లే చేస్తారు. దానిని చూసిన వెంటనే శ్రీలీల తల్లి మన తారక్ బాబు అండీ, చిన్నప్పుడు అద్భుతంగా క్లాసిక్ డ్యాన్స్ చేసేవాడు, అతని డ్యాన్స్ చూసే నాకు కూతురు పుడితే ఆమెకు కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని అనుకున్నాను, అనుకున్నట్టే ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాను, అలా చిన్నప్పటి నుండి ఆ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో నేటి తరం లో డ్యాన్స్ ఐకాన్ గా ట్రెండ్ అవుతున్న శ్రీలీల లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఎన్టీఆర్ ని చూసే డ్యాన్స్ నేర్చుకుంది అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎన్నో ఫన్నీ మూమెంట్స్, మరియు మరికొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో సాగిపోయిన శ్రీలీల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ప్రోగ్రాం కి సంబంధించిన రెండవ ఎపిసోడ్ ని వెంటనే జీ5 లో చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం తెలుగు లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అదే విధంగా ఆమె బాలీవుడ్ లో ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది.