Mirai Movie Making Video: ‘హనుమాన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన చిత్రం ‘మిరాయ్'(Mirai Movie). హనుమాన్ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, తేజ సజ్జ తన తదుపరి చిత్రం ‘మిరాయ్’ ని ‘హనుమాన్’ కి మించేలా తన వంతు ప్రయత్నం చాలా గట్టిగానే చేసాడు. నిన్న ఈ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో లో తేజ సజ్జ పడిన కష్టాన్ని చూస్తుంటే కచ్చితంగా మళ్ళీ ఆయన పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతాడని అనిపిస్తుంది. ముఖ్యంగా ఫైట్స్ కోసం ఆయన పడిన కష్టం మామూలు రేంజ్ లో లేదు. సాధారణంగా ఇలాంటి ఫైట్స్ ని హీరోలతో కాకుండా డూప్స్ తో పని కానిచ్చేస్తూ ఉన్నారు. కానీ తేజ సజ్జ డూప్స్ సహాయం లేకుండానే ఈ సినిమాలో స్తంట్స్ చేయడం చూసి అందరు ఆశ్చర్యపోయారు.
ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ గా ‘కెచ్చా’ మాస్టర్ వ్యవహరిస్తున్నాడు. ఆయనకు తెలుగు రాకపోయినా కూడా, హీరో కి అర్థం అయ్యే విధంగా స్టంట్స్ ఎలా చెయ్యాలో దగ్గరుండి చూపిస్తున్నాడు. ఇలా అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చేసి చూపిస్తే ఎలాంటి హీరో అయినా అద్భుతంగా చేస్తాడని అనిపించింది. ఆ రేంజ్ లో ఆయన నటీనటలకు పెర్ఫర్మ్ చేసి చూపిస్తున్నాడు. ఓవరాల్ గా ఈ చిత్రం చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని, రవితేజ ఈగల్ చిత్రం తో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినప్పటికీ కార్తీక్ కి డైరెక్టర్ గా మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆయనలో ఈ రేంజ్ టాలెంట్ ఉందా అని ‘మిరాయ్’ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే అర్థం అవుతుంది.
ఇకపోతే ఈ చిత్రం మంచు మనోజ్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తేజ సజ్జ కి సంబంధించిన మేకింగ్ వీడియో వచ్చినట్టుగానే, మనోజ్ కి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. చాలా మంది ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కానీ, అందుకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న మీరే మేకింగ్ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.