Sreeleela: శ్రీలీల అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా. తెలుగు తెరకి పరిచయమవుతూనే వరుస అవకాశాలను అందుకుంది .. చాలా తేలికగా క్రేజీ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పైగా అది నాగచైతన్య సినిమా కావడం విశేషం. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సినిమా తెలుగు – తమిళ భాషల్లో రూపొందుతుంది. మొత్తానికి శ్రీలీల క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
ఇంతకీ ఈ సినిమా డిటైల్స్ విషయానికి వస్తే.. నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా చాలామంది పేర్లు వింపించాయి. కానీ.. ఈ సినిమా శ్రీలీల దగ్గరకు వచ్చింది. ఇక కెరీర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. శ్రీలీలకు ఏడో సినిమా. ఆరో సినిమా ఏదో తెలుసా ? టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య బాబు సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు ఆరో సినిమా.
Also Read: Chor Baazar Collections: ప్చ్.. ఆకాష్ పూరి నెత్తిన బిగ్గెస్ట్ డిజాస్టర్
ఈ సినిమా కథ తండ్రి – కూతురు మధ్య సాగుతుంది. ఫాదర్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో బాలయ్య తండ్రి వయసు వ్యక్తిలా కనిపించబోతున్నారు. కూతురి పాత్రలో శ్రీలీల నటించబోతుంది. ‘పెళ్లిసందD’ సినిమాలో హాట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల, మొత్తానికి బాలయ్య కూతురిగా కనిపించబోతుంది.
మరి ఈ హాట్ యంగ్ బ్యూటీ బాలయ్యకి కూతురు ఎలా నటిస్తోందో చూడాలి. నిజానికి ఇండస్ట్రీలో సింగిల్ హిట్ వస్తే.. లైఫ్ చాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల లైఫ్ ఓవర్ నైట్ లోనే చేంజ్ అయిపోతుంది. అయితే, ఇంతవరకూ ఒక్క హిట్ కూడా పడకుండానే.. శ్రీలీలకు భారీ డిమాండ్ రావడం నిజంగా విశేషమే. ఇక శ్రీలీల తన రెమ్యునరేషన్ ను దారుణంగా పెంచేసింది.
‘శ్రీలీల’ రెండు కోట్లు అడుగుతుంది అట. విపరీతంగా డిమాండ్ పెరిగినప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పు ఏముందిలే అండి. అందుకే.. పెంచాను అని నిర్మాతలకు నవ్వుతూ చెబుతుందట ఈ చిన్నది. అమ్మడు ఫుల్ టాలెంటెడ్ అని టాక్ ఉంది. తెలివి ఉంది కాబట్టే.. ఒక్క హిట్ కూడా లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యింది.
Also Read:Srinidhi Shetty: పాన్ ఇండియా హిట్ కొట్టినా.. పాపం, పాపకు కలిసి రావడం లేదు