Sreeleela in Ajith Movie: సినీ ఇండస్ట్రీ లో హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా మినిమం టాలెంట్ ఉన్నా పర్వాలేదు కానీ , అదృష్టం మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. అదృష్టం లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా వృధా. అదే అదృష్టం తోడుగా ఉంటూ తక్కువ టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీ లో అవకాశాలు సంపాదించొచ్చు అని నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ శ్రీలీల(Actress Sree Leela). ఆమె అందం గా ఉంటుంది , డ్యాన్స్ అదిరిపోయే రేంజ్ లో వేస్తుంది , మంచి మనసు ఉన్న అమ్మాయి , కానీ యాక్టింగ్ టాలెంట్ మాత్రం సున్నా. సోషల్ పై వచ్చినన్ని ట్రోల్స్ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ మీద కూడా రాలేదు. అంతే కాదు , ఈమెకు ఫ్లాప్స్ కూడా చాలా ఎక్కువే. కెరీర్ మొత్తం మీద రెండే రెండు సరైన హిట్లు.
ఒకటి ధమాకా , మరొకటి భగవంత్ కేసరి. మిగిలిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈమధ్యనే ఈమె తమిళంలోకి అడుగుపెట్టి , అక్కడ కూడా ‘పరాశక్తి’ మూవీ తో ఫ్లాప్ బోణీ కొట్టేసింది. ఇలా కెరీర్ మొత్తం ఫ్లాప్స్ ఉన్నప్పటికీ , ఈమెకు అవకాశాలు మాత్రం ఆగడం లేదు . రీసెంట్ ఏ అనుష్ మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల , ఇప్పుడు ఏకంగా తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ చిత్రం లో నటించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి అజిత్ తనతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన అద్విక్ రవిచంద్రన్ తో కలిసి త్వరలోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుందని లేటెస్ట్ గా కోలీవుడ్ లో వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అజిత్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అంటే సాధారణమైన విషయం కాదు. చాలా పెద్ద అవకాశం అనే చెప్పాలి . ఇప్పటికే ఈమె సౌత్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారితో కలిసి నటించింది . మహేష్ తో చేసిన ‘గుంటూరు కారం’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వచ్చే నెల 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయితే శ్రీలీల కొత్త ఇన్నింగ్స్ మొదలు అవుతుందని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.