https://oktelugu.com/

కలెక్షన్లకు ‘శ్రీకారం’.. తొలిరోజు ఎంతంటే?

శర్వనంద్ హీరోగా 14 రీల్ ప్లస్ సంస్థ నిర్మించిన సినిమా శ్రీకారం. రైతు సమస్యలపై నిర్మించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేయడం బాగా కలిసివచ్చిందని చెప్పవచ్చు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.4 కోట్ల వరకు వసూళ్లను సాధించింది శ్రీకారం. అయితే వీటిల్లో చాలా చోట్ల ఫిక్స్ డ్ హయ్యర్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరులో కాస్త ఎక్కువ. వాటిని కట్ చేసినా.. కూడా సినిమా మూడు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 02:17 PM IST
    Follow us on


    శర్వనంద్ హీరోగా 14 రీల్ ప్లస్ సంస్థ నిర్మించిన సినిమా శ్రీకారం. రైతు సమస్యలపై నిర్మించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేయడం బాగా కలిసివచ్చిందని చెప్పవచ్చు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.4 కోట్ల వరకు వసూళ్లను సాధించింది శ్రీకారం. అయితే వీటిల్లో చాలా చోట్ల ఫిక్స్ డ్ హయ్యర్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరులో కాస్త ఎక్కువ. వాటిని కట్ చేసినా.. కూడా సినిమా మూడు కోట్లకు పైగానే తొలిరోజు వసూలు చేసిందని విశ్లేషకులు అంటున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లోనూ ఇదే మారిది గట్టి వసూళ్లు సాగించాల్సి ఉంది. ఎందుకంటే.. ఆంధ్రాలో బయ్యర్లు రికవరీ కావాలంటే ఈ మేరకు కలెక్షన్లు కావాల్సి ఉంటుంది. అయితే వరుస సెలవులు కాబట్టి.. ఆ మేరకు వసూళ్లు ఉంటాయనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    Also Read: బికినీలో అందాలు ఆరబోసిన సమంత..

    అయితే జాను సినిమాతో నిరాశపరిచిన శర్వానంద్ ఈసారి లవ్ స్టోరీ కాకుండా అన్నదాతల కథను ఎంచుకున్నాడు. కావల్సినంత ప్రేమ. సరిపోయే సెంటిమెంటు.. అల్లరి చేసిన ఫ్రెండ్స్.. ఏడిపించే నాన్న.. నవ్వించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. దీని చుట్టూ తిరిగే.. హీరో క్యారెక్టర్ ఇదే శ్రీకారం కథ.. అయితే శివరాత్రి రోజున దీనితో పాటు మరో రెండు మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇటీవల రైతుల సారాంశంతో తీసిన సినిమాలు తక్కవే కాబట్టి.. హట్టయ్యే అవకాశాలు ఎక్కవుగానే కనిపిస్తున్నాయి.

    సినిమా సారాంశం ఏమింటే..అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు. కొడుకు కార్తీక్ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. ఆఫీసులో చాలా మంచి అబ్బాయి. చైత్ర ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. హీరో తన పని తాను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్టు విషయంలో కంపెనీ యాజమాన్యం కార్తీక్ ను అమెరికా పంపేందుకు నిర్ణయం తీసుకుంటుంది. కానీ కార్తీక్ కు ఇష్టం లేక ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకునేందుకు ఇంటికి వెళ్తాడు. వ్యవసాయం దండగా అని వదిలేసిన కొంతమందితో కలిసి ఉమ్మడి సాగు చేస్తాడు. అసలు కార్తీక్ ఉద్యోగం ఎందుకు మానేశాడు..? వ్యవసాయం ఎందుకు చేస్తాడు..? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏమిటి..? టెక్నాలజీని వాడుకుని సాగు ఎలా చేశాడననదే మిగితా కథా సారాంశం.

    Also Read: ఓన్లీ ప్రభాస్ కే పరిమితం అవుతుందా ?

    విభిన్నమైన కథను ఎంచుకున్న శర్వానంద్ ఈ సినిమాలో నటనతో మెప్పించాడు. కంప్యూటర్ ముందు యంత్రంలా పనిచేసే యువ సాఫ్ట్ వేర్ పొలంలో దిగితే ఎలా ఉంటుందన్నది చూపించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తీక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తనకు అనుభవం ఉన్న ఎమోషనల్ సన్నీవేశాలు కూడా చక్కగా పండించాడు. కథనంతా బుజాన వేసుకుని నడిపించాడు. తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుల్ మోహన్ మెప్పించింది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి. కేశవులు పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. తల్లిగా ఆమని ఆకట్టుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్