spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeja Konidela Emotional Video: తప్పు తెలుసుకున్నాను.. ఇప్పుడు పూర్తిగా మారిపోయానంటూ శ్రీజ కొణిదెల ఎమోషనల్...

Sreeja Konidela Emotional Video: తప్పు తెలుసుకున్నాను.. ఇప్పుడు పూర్తిగా మారిపోయానంటూ శ్రీజ కొణిదెల ఎమోషనల్ వీడియో వైరల్..

Sreeja Konidela Emotional Video: ఒక విధంగా చెప్పాలంటే రామ్ చరణ్ కంటే ముందు , మెగా అభిమానులకు , సినీ అభిమానులకు , రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు , చిరంజీవి కూతురు శ్రీజ సుపరిచితురాలు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు , శ్రీజ ఇంట్లో నుండి పారిపోయి, భరద్వాజ్ అనే అతన్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ , మా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి నాకు ప్రాణహాని ఉంది , ఇలా చేస్తే ఆయన చంపేస్తాడు అంటూ చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన గన్ ని సరెండర్ చేయడం , అప్పట్లో ఒక సంచలనం, నెలల పాటు ఆ సంఘటన గురించి మాట్లాడుకున్నారు , ఇప్పటికీ శ్రీజ పేరు వినిపిస్తే జనాలకు ఈ సంఘటనలే గుర్తుకు వస్తాయి.

అయితే పెళ్లి అయ్యి , కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకు భరద్వాజ్ తో విబేధాలు ఏర్పడి , విడిపోవాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవి మరోసారి శ్రీజ ని దగ్గరకు తీసుకోవడం , కొన్నాళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తి కి ఇచ్చి రెండవ పెళ్లి చేయడం , కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకు అతనికి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనల కారణంగా శ్రీజ పై మెగా అభిమానుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇది ఇలా ఉండగా శ్రీజ చాలా కాలం నుండి సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. తన జీవితం లో జరిగే విషయాలకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు పోస్టుల రూపం లో కానీ , స్టోరీ రూపం లో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన వీడియో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘నాకే ఎందుకిలా జరుగుతుంది?, నేనేమి పాపం చేసానని ఇంతటి మానసిక క్షోభ ని అనుభవించాలి?, ఒకదాని వెంట మరొకటి , జీవితమంతా కష్టాలే అని నాలో నేనే చాలా రోజులు మదనపడ్డాను. అయితే నా జీవితం లో జరిగిన సంఘటనలు కారణంగా నేను బాధితురాలిని అనే భావన నుండి నెమ్మదిగా బయటపడ్డాను. మన జీవితం ఏంటి ఇలా సాగిపోతుంది?, ఎప్పుడూ ఇంతేనా అని బాధపడడం కంటే, మన జీవితాన్ని మార్చుకునేందుకు ఏమి చేయగలం ? అని తెలుసుకోవడమే అసలైన మార్పు. అలా సెల్ఫ్ మాస్టర్ ప్రాజెక్ట్ వల్ల నాలో మార్పు మొదలండి. నా ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు జీవితం ప్రశాంతంగా మారింది , నేనేంటో తెలుసుకున్నాను. ఒకప్పుడు నా జీవితం లో జరిగిన తప్పులే నా గుర్తింపుని నిర్థారించాయని అనుకున్నాను. కానీ అది పూర్తిగా తప్పని తెలుసుకున్నాను, బాధ కేవలం నాలో ఒక భాగమే కానీ అదే నా జీవితం కాదని అర్థం చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీజ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version