Sree Vishnu: తెలుగులో హీరోలు ఎక్కువైపోయారు. మరి ఆ హీరోల్లో తనకంటూ ఓ చిన్నపాటి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం అంటే ఇప్పుడు గగనం అయిపోయింది. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అడ్రస్ లేకుండా వచ్చి.. హీరోగా శ్రీవిష్ణు తనకంటూ ఒక చిన్న మార్కెట్ ను తెలుగు బాక్సాఫీస్ వద్ద బాగానే సృష్టించుకున్నాడు. ఆ మార్కెట్ ను పెంచుకునే క్రమంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

దాంతో తెలుగులో శ్రీ విష్ణు అంటే ఒక ఇమేజ్ వచ్చేసింది. రెమ్యునరేషన్ కోసమో, లేక మొహమాటం కోసమో ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు, సెలెక్టివ్ గా వెళ్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు నుండి వస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. ఈ సినిమా అవుట్ ఫుట్ పై ఇండస్ట్రీలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాపై భారీగా ఖర్చు పెడుతున్నారు.
పైగా డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. అన్నిటికీ మించి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడం పాటు ఓ వర్గం ప్రేక్షకులను ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ప్రత్యేక ప్రేమను చూపించడానికి.. సినిమాలో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ఫ్యాన్.
అందుకే, ఈ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ భుజాన వేసుకొని తెగ ట్రెండ్ చేయడానికి ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు నటిస్తున్నాడు కాబట్టి.. పైగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ లో ఎన్టీఆర్ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు కాబట్టి.. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా పట్ల తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
Also Read: Celebrities: పెళ్లి పెటాకులు చేసుకున్న హీరోహీరోయిన్లు !
అందుకే, ఈ సినిమాకు మొదటి నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. మాములుగా శ్రీ విష్ణు సినిమాలకు వచ్చే రెస్పాన్స్ కంటే ఈ చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ రావడానికి కారణం మాత్రం ఎన్టీఆరే. అయితే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే.. ఒకప్పుడు సినిమాలో అభిమాన హీరో అంటే… చిరంజీవిని చూపించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ను చూపిస్తున్నారు.
Also Read: Vijay Setupathi: సేతుపతిపై దాడి చేస్తే రివార్డు ప్రకటంచిన హిందూవాదిపై పోలీసులు కేసు నమోదు