https://oktelugu.com/

Samantha: మంత్రి కేటీఆర్ పోస్ట్ కు స్పందించిన సమంత… ఏం అన్నారంటే ?

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ సమంత. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని… టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రతించిన విషయం తెలిసిందే.  వీరి విడాకుల ప్రకటన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 03:41 PM IST
    Follow us on

    Samantha: ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ సమంత. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని… టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రతించిన విషయం తెలిసిందే.  వీరి విడాకుల ప్రకటన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది సామ్​. అయితే చైతన్యతో విడిపోయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. అంతకు ముందు కేవలం తన ఫొటోస్, తన వర్క్ కి సంబంధించినవి మాత్రమే షేర్ చేసేది. కానీ విడాకుల తర్వాత నుంచి ఎక్కువగా కొటేషన్స్, వివిధ అంశాలపై కూడా షేర్ చేస్తూ స్పందిస్తుంది సామ్.

    తాజాగా  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది సమంత. ఆప‌ద‌లో ఉన్న పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. తెలంగాణలో జిల్లాకొక‌టి చొప్పున 33 జిల్లాలకు 33 బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే ఈ వాహనాలు వచ్చి వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు. మంత్రి సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

    కాగా మంత్రి సత్యవతి గారు గొప్ప నిర్ణయం తీసుకుందని కేటీఆర్ పొగిడారు. కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి 33 బాల రక్షక్ వెహికల్స్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఆపదలో ఉన్న బాలల కోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా 1098 కి డయల్ చేయండి అంటూ పోస్ట్ లో రాశారు.