Homeఎంటర్టైన్మెంట్Sree Satya's Tragic Love Story: బ్రేకప్ డిప్రెషన్ తట్టుకోలేక అలా చేశా, నావల్లే అమ్మకు...

Sree Satya’s Tragic Love Story: బ్రేకప్ డిప్రెషన్ తట్టుకోలేక అలా చేశా, నావల్లే అమ్మకు పక్షవాతం.. బిగ్ బాస్ శ్రీసత్య ట్రాజిక్ లవ్ స్టోరీ

Sree Satya’s Tragic Love Story:  బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య తన ట్రాజిక్ లవ్ స్టోరీ బయటపెట్టింది. ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తన తల్లికి పక్షవాతం రావడానికి కూడా తానే కారణం అయ్యానని ఆమె వేదనకు గురైంది.

నటి కావాలనే తపనతో పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీసత్య పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. రామ్ పోతినేని-కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజ చిత్రంలో శ్రీసత్య(SRI SATYA) ఓ పాత్ర చేసింది. అనంతరం ఒకటిరెండు చిన్న చిత్రాల్లో ఆమె నటించింది. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాకపోవడంతో సీరియల్ నటిగా మారింది. ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, అక్కా చెల్లెళ్ళు, త్రినయని వంటి సీరియల్స్ లో శ్రీసత్య కీలక రోల్స్ చేసింది. అయితే శ్రీసత్యకు ఫేమ్ తెచ్చింది మాత్రం బిగ్ బాస్(BIGG BOSS TELUGU SEASON 6) రియాలిటీ షో. 2022లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో శ్రీసత్య కంటెస్ట్ చేసింది.

Also Read:  Sri Sathya: అతనితో కలిసి నటించేందుకు ఎదురు చూస్తున్నాను..అతని కోసమే సినిమాల్లోకి వచ్చినట్లు షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ సత్య…

శ్రీసత్య ఈ షో ద్వారా పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ మూటగట్టుకుంది. షోలో ఆమె ప్రవర్తన విమర్శలపాలైంది. ఇతర కంటెస్టెంట్స్ ని వాడుకు ఆమె పబ్బం గడుపుకునేది అని ప్రేక్షకులు విమర్శించారు. సోషల్ మీడియాలో శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఓ వర్గం ఆమెకు ఓట్లు వేయడంతో చివరి వారం వరకు ఉంది. అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. ఈ కారణంగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోయింది. కాగా ఫ్యామిలీ వీక్ లో శ్రీసత్య తల్లి వీల్ చైర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ పరిణామం శ్రీసత్యకు సింపతీ తెచ్చిపెట్టింది.

శ్రీసత్య తల్లికి పక్షవాతం. కొన్నేళ్లుగా ఆమె కుర్చికే పరిమితం అయ్యారు. ఆమె పరిస్థితికి తానే కారణం అంటూ ఓ షాకింగ్ మేటర్ బయటపెట్టింది శ్రీసత్య. ప్రియుడితో బంధం తెగిపోవడంతో శ్రీసత్య డిప్రెషన్ కి గురైందట. బ్రేకప్ టైంలో ఆమె ఎవరితో మాట్లాడేది కాదట. ఇంట్లో గదికే పరిమితం అయ్యేదట. తన పరిస్థితిని చూసిన తల్లి మానసిక వేదనకు గురైందట. ఆమె మెదడులో సమస్యలు తలెత్తాయట. అదే పక్షవాతానికి దారి తీసిందట. తల్లి బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు అట. దాదాపు 30 రోజులు ఆసుపత్రిలో తాను ఒక్కటే తల్లిని చూసుకుందట. కోవిడ్ సమయం కావడంతో పాటు తండ్రికి షుగర్ కావడంతో రిస్క్ తీసుకోలేదని, నేను ఒక్కదాన్నే ఆసుపత్రిలో అమ్మను చూసుకున్నాను అని శ్రీసత్య చెప్పుకొచ్చింది.

బ్రేకప్ కారణంగా రెండేళ్లు పరిశ్రమకు దూరం కావాల్సి వచ్చిందని శ్రీసత్య.. ఒకప్పటి తన కష్టాలను బయటపెట్టింది. ఆహాలో ప్రసారం అవుతున్న కాకమ్మ కథలు సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీసత్య ఈ కామెంట్స్ చేసింది. తేజస్వి మాదివాడ హోస్ట్ గా ఉన్న ఈ షోలో శ్రీసత్య తో పాటు మానస్(MANAS) పాల్గొన్నాడు. ప్రస్తుతం శ్రీసత్య పలు టెలివిజన్ షోలలో సందడి చేస్తుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో సైతం శ్రీసత్య కంటెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular