Ram Charan Peddi: ‘గేమ్ చేంజర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) చేస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఏప్రిల్ నెలలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ వైడ్ గా పెద్ది సిగ్నేచర్ షాట్ వచ్చిన రీచ్ వేరు. ‘పుష్ప’ చిత్రం లోని మ్యానరిజమ్స్ విడుదల తర్వాత ఫేమస్ అయితే, ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించుకుంది. ఈసారి రామ్ చరణ్ కొట్టే దెబ్బకు పాన్ ఇండియా రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని, దెబ్బ తిన్న పులి ఆకలితో వేటాడితే ఎలా ఉంటుందో ఈసారి రామ్ చరణ్ వేట అంతటి వైల్డ్ గా ఉంటుందని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.
Also Read: అందువల్లే టెస్ట్ కెప్టెన్సీ తీసుకోలేదు.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన బుమ్రా
ఆ నమ్మకాన్ని గ్లింప్స్ వీడియో సగం నిజం చేసింది. మిగిలిన సగం ఈ సినిమా నుండి విడుదలయ్యే ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ నిజం చేస్తుందని అంటున్నారు అభిమానులు. నిన్న సోషల్ మీడియా లో ‘పెద్ది’ మూవీ షూటింగ్ కి సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్ ని విడుదల చేశారు. ఊర మాస్ లుక్ తో రామ్ చరణ్ కెమెరా వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈ స్టిల్ ఒక భారీ ఫైట్ సన్నివేశానికి సంబంధించినది అట. హైదరాబాద్ లో అవినాష్ కొల్ల వేసిన భారీ సెట్స్ లో ట్రైన్ స్టంట్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆద్వర్యం లో ఈ సన్నివేశం తెరకెక్కుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ సన్నివేశాన్ని ఎవ్వరూ చూసి ఉండరట, అలాంటి సన్నివేశాన్ని డిజైన్ చేసాడు డైరెక్టర్ బుచ్చి బాబు.
సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయట. రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో నుండి ఎలాంటి యాక్షన్ సన్నివేశాల్లో చూడాలని కోరుకుంటున్నారో అలాంటి సన్నివేశాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్. అంతే కాదు సినిమాలో అందుకు తగ్గ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కూడా బలంగా ఉంటాయని, రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ చిత్రాన్ని మర్చిపోయే రేంజ్ లో ఈ సినిమా రెడీ అవుతుందని అంటున్నారు. నేడే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారుగా 130 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిందట. ఇది రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఆయన గత చిత్రం ‘గేమ్ చేంజర్’ కి 120 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. డిజిటల్ రైట్స్ నే ఈ రేంజ్ లో ఉంటే, ఇక థియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.