Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచిచం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి… వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
గతంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్లను ఈ అమ్మడు ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరూ ఫుల్ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి ని రిఫరెన్స్ గా తీసుకుంటాము. ఆమెను కాంటాక్ట్ అవుతామని చెప్పడంలో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సంపాదించింది. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత ఎక్కువ పెంచుకుంది ఈ బ్యూటీ. ఆమె క్రేజ్ తో ఏకంగా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది కూడా.
అయితే రీసెంట్ గా స్రవంతి హాస్పిటల్లో చేరింది. ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. షూటింగ్‌కు డేట్లు ఇచ్చానే.. లీవ్ అడగాలి.. పర్మిషన్ తీసుకోవాలని మాత్రం మొహమాట పడొద్దు.. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే.. మహిళలకు మరీ ముఖ్యంగా చెబుతున్నాను.. ఆరోగ్యమే ప్రధానంటూ యాంకర్ స్రవంతి తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించింది. మరి ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.
అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదని.. కేవలం అవగాహన కోసం మాత్రమే పెడుతున్నాఅంటూ తెలిపింది. అందులోనూ మరీ ముఖ్యంగా ఆడవాళ్ల కోసం పెడుతున్నా అని పేర్కొంది స్రవంతి. గత 35 – 40 రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్ అవుతుందట. రకరకాల మెడిసిన్ వాడిందట. డాక్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదట స్రవంతి.
ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగిందిట. అయితే ఆ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందట. ఇక ఆలస్యం చేయవద్దని వెంటనే డాక్టర్ ని సంప్రదించిందట. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య అని అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లిందట. ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుంచి 5 వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారట.
సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను.. మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో .. ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి.. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే.. హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ.. వర్క్,షూట్స్ ,ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి.. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి’ అని సలహాలు ఇచ్చింది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Sravanti chokkarapu admitted to the hospital after neglecting to bleed for 40 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com