https://oktelugu.com/

SR Kalyanamandapam Total Collections: ‘SR కళ్యాణమండపం’ టోటల్ కలెక్షన్స్ !

SR Kalyanamandapam Total Collections: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. మొదటి సినిమాతోనే తాను మంచి టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. అలాగే, అదృష్టం కలిసి వచ్చి.. రెండో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పైగా టైటిల్ లోనే కొత్తదనం చూపించేలా ‘SR కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) అని పేరు పెట్టి.. భిన్నమైన ఎమోషనల్ డ్రామా అంటూ కొడుకు – తండ్రిల మధ్య ఫీల్ గుడ్ డ్రామాతో సినిమాని వదిలారు. ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమాకి […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2021 / 10:25 AM IST
    Follow us on

    SR Kalyanamandapam Total Collections: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. మొదటి సినిమాతోనే తాను మంచి టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. అలాగే, అదృష్టం కలిసి వచ్చి.. రెండో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పైగా టైటిల్ లోనే కొత్తదనం చూపించేలా ‘SR కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) అని పేరు పెట్టి.. భిన్నమైన ఎమోషనల్ డ్రామా అంటూ కొడుకు – తండ్రిల మధ్య ఫీల్ గుడ్ డ్రామాతో సినిమాని వదిలారు. ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమాకి ఈ స్థాయిలో బజ్ రాలేదు.

    అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకి ఎవరేజ్ హిట్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్ల వర్షం కురిసింది. ఈ సినిమా రిలీజ్ అయి, నేటికీ రెండు వారాలు అవుతుంది. మరి కలెక్షన్స్ పరిస్థితి ఏమిటో చూద్దాం.

    2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్:

    నైజాం – 2.94 కోట్లు

    ఈస్ట్ – 0.51 కోట్లు

    వెస్ట్ – 0.35 కోట్లు

    గుంటూరు – 0.69 కోట్లు

    కృష్ణా – 0.42 కోట్లు

    సీడెడ్ – 1.15 కోట్లు

    ఉత్తరాంధ్ర – 0.98 కోట్లు

    నెల్లూరు – 0.25 కోట్లు

    తెలంగాణ & ఏపీలో “SR కళ్యాణమండపం” ఫస్ట్ టు వీక్ కలెక్షన్ల షేర్ : రూ. 7.66 కోట్లు,

    ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ మరియు ‘ఓవర్సీస్’ కలెక్షన్స్ విషయానికి వస్తే..

    రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ : 0.70 కోట్లు,

    వరల్డ్ వైడ్‌ గా చూసుకుంటే “SR కళ్యాణమండపం” సినిమా 14 రోజుల్లో దాదాపు 8.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మొత్తానికి కిరణ్ అబ్బవరంకి మార్కెట్ లేకపోయినా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కలెక్షన్స్ బట్టి ఈ సినిమా గొప్ప విజయం సాధించినట్లే. ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న సినిమాల పరిస్థితి బాగాలేదు. ఆ రకంగానూ ఈ సినిమా అదనపు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

    ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరంకు ఇది గొప్ప రిలీఫ్ కలిగించే అంశం. మొత్తమ్మీద బాక్సాఫీస్ వద్ద “SR కళ్యాణమండపం” సూపర్ హిట్ గా నిలిచింది.