BECIL Recruitment 2021: ప్రముఖ కంపెనీలలో ఒకటైన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 162 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 22వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
మొత్తం 162 ఉద్యోగ ఖాళీలలో స్టాఫ్ నర్సు, వార్డ్ అటెండెంట్, మెడికల్ ఆఫీసర్, రీసెర్చ్ కోఆర్డినేటర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, బయో మెడికల్ ఇంజనీర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
పది, ఇంటర్ తో పాటు బీటెక్, బీఎస్సీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 15,492 రూపాయల నుంచి 1,23,100 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు 450 రూపాయలు కాగా మిగిలిన పోస్టులకు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 300 రూపాయలు, మిగిలిన అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.