https://oktelugu.com/

Squid Game : ‘స్క్విడ్ గేమ్’ 3వ సీజన్ విడుదల తేదీని ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ..వైరల్ అవుతున్న వీడియో!

మన ఇండియన్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే వెబ్ సిరీస్ లలో ఒకటి 'స్క్విడ్ గేమ్'. ఈ కొరియన్ వెబ్ సిరీస్ లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

Written By: , Updated On : January 31, 2025 / 05:37 PM IST
Squid Game

Squid Game

Follow us on

Squid Game : మన ఇండియన్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే వెబ్ సిరీస్ లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్’. ఈ కొరియన్ వెబ్ సిరీస్ లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పట్లో ఈ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పేదరికం జీవితాన్ని అనుభవించే వాళ్లకు గేమ్స్ ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చు అనే ఆశ చూపించి వందలాది మందిని ఒక దీవికి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తారు. ఈ గేమ్స్ ఆడిన వారికి అంతులేని సంపద లభిస్తుంది. చనిపోయేవరకు వేరే పని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ గేమ్స్ లో ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. మొదటి సీజన్ లో హీరో ఈ ఆటలన్నీ గెలిచి అంతులేని సంపద ని ప్రైజ్ మనీ గా పొందుతాడు. కానీ అమాయకుల ప్రాణాలను తీసే ఈ గేమ్స్ ని ఎట్టి పరిస్థితి లో ఆపాలని అనుకుంటాడు.

అందుకోసం మళ్ళీ స్క్విడ్ గేమ్స్ ని నిర్వహించే దీవిలోకి అడుగుపెడుతాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం తన ఉన్నవారిలో ధైర్యాన్ని నింపి, స్క్విడ్ గేమ్స్ నిర్వహిస్తున్న సైనికులపై పోరాటం చేస్తారు. ఈ పోరాటం లో ఎంతో మంది సైనికులు చనిపోతారు. కానీ చివరికి యాజమాన్యం కి దోరికిపోతారు. ఆ తర్వాత ఏమైంది అనేది సీజన్ 3 లో చూసుకోవాల్సిందే. ఇదే చివరి సీజన్ కూడా. మొదటి సీజన్ వచ్చిన మూడేళ్లకు రెండవ సీజన్ వచ్చింది. కానీ మూడవ సీజన్ కి అన్ని రోజుల గ్యాప్ ఉండదని ముందుగానే ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ, రీసెంట్ గానే విడుదల తేదీని కూడా ప్రకటించింది. జూన్ 27న చివరి సీజన్ ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. హీరో అనుకున్నది సాధించాడా లేదా అనేది ఉత్కంఠభరితంగా చూపించారట ఈ సీజన్ లో..అనేక ట్విస్టులు కూడా ఉంటాయని సమాచారం.

అయితే మొదటి సీజన్ కి వచ్చినంత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రెండవ సీజన్ కి రాలేదు అనేది వాస్తవం. క్లైమాక్స్ చాలా దారుణంగా ఉందని, ఈ సీజన్ తోనే ముగించాల్సి స్టోరీ ని, మూడవ సీజన్ వరకు సాగతీస్తున్నారని మండిపడ్డారు అభిమానులు. మూడవ సీజన్ లో ఎక్కువ ఎపిసోడ్స్ కూడా ఉండవట. కేవలం 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయట. ఆ 5 ఎపిసోడ్స్ ని రెండవ సీజన్ లోనే జత చేసి ఉంటే బాగుండేది కదా, మళ్ళీ మూడవ సీజన్ ఎందుకు, కేవలం బిజినెస్ కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే స్క్విడ్ గేమ్స్ అనేవి కల్పిత కథ కాదట. గతంలో కొరియా దేశ అద్యక్ష్యుడు పేదలు లేని దేశం గా చేయాలనీ ఈ స్క్విడ్ గేమ్స్ ని నిర్వహించాడట. దానికి సంబంధించిన ఆదారాలు కూడా ఇటీవలే సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.

Squid Game: Season 3 | First Trailer | Netflix (4K)