CM Chandrababu
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వాటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి మరి సంక్షేమాన్ని అమలు చేస్తామని.. అవసరమైతే రెట్టింపు పథకాలను పెడతామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. వాస్తవ పరిస్థితి ఇది అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి.. పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు కంటే జగన్ నయమన్న స్థితికి జనాలు వస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు. తాజాగా మీడియా ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
* పథకాలు సైతం ఆలస్యం
కూటమి ( Alliance )అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు సమీపిస్తోంది. ఇప్పటివరకు పింఛన్ల మొత్తం పెంచి అమలు చేయగలిగారు. బకాయిలతో అందించగలిగారు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇంకోవైపు అన్నదాత సుఖీభవ అందించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. జూన్లో అమ్మకు వందనం పథకం అమలు చేయడానికి నిర్ణయించారు. నిధుల సమీకరణ చేపడుతున్నారు. అలాగే డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత.. బాధ్యతలు స్వీకరించాక డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. కానీ 8 నెలలు దాటుతున్న ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసన కూడా చేపట్టారు.
* డీఎస్సీ నిర్వహణలో వైసిపి ఫెయిల్
వాస్తవానికి వైసీపీ( YSR Congress ) ప్రభుత్వ హయాంలో 6000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ రకరకాల కారణాలు చెబుతూ నియామక ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. రాత పరీక్ష సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా పడింది. తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని 2019లో జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. చివరకు గత ఏడాది సంక్రాంతి తర్వాత సన్నహాలు ప్రారంభించారు. ఇంతలో ఎలక్షన్ రావడంతో డీఎస్సీ నిలిచిపోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ విషయంలో కదలిక వచ్చింది. మరో 10 వేల పోస్టులను కలుపుతూ
… 16 వేల పోస్టులను ప్రకటించారు చంద్రబాబు. దీంతో అభ్యర్థులు ఎంతగానో సంతోషించారు. కానీ కాలం గడుస్తున్న నియామక ప్రక్రియ పూర్తికాలేదు. దీనిపై రకరకాల విమర్శలు వచ్చాయి.
* భిన్నంగా స్పందించిన సీఎం
అయితే ఎస్సీ వర్గీకరణ నుంచే డీఎస్సీ ( DSC )నియామక ప్రక్రియ నిలిచిపోయిందన్నది వాస్తవం. ఇంతవరకు డీఎస్సీ ప్రకటన రాలేదు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కూడా జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో డీఎస్సీ నియామకాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. రాత్రికి రాత్రి అన్ని జరిగిపోవని.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. పూర్తయిన వెంటనే మెగా డీఎస్సీ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు బాబు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.