Star Heroine : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా సినిమా రంగాన్ని ఏలుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా అలాంటి జాబితాకి చెందిందే. తన మొదటి సినిమాకు ఆమె రూ. 10 పారితోషకంగా తీసుకుందట. ఆ తర్వాత కాలంలో ఇండియన్ సినిమాలో అత్యంత ఖరీదైన హీరోయిన్ గా ఎదిగింది. ఆమె మరెవరో కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద. అతి చిన్న వయసులోనే జయప్రద చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగానికి పరిచయమైంది. ఆ తర్వాత ఈమె అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. జయప్రద ఏ పాత్ర చేసినా సరే అందులో పూర్తిగా లీనమైపోతారు. అదే ఆమె స్పెషాలిటీ అని చెప్పడంలో సందేహం లేదు. జయప్రదకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో జయప్రద దేవత, సాగర సంగమం, సిరిసిరిమువ్వ వంటి అనేక ఎవరి గురించి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రతి సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెలుగుతోపాటు జయప్రద హిందీ, తమిళం, మలయాళం భాషలలో ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అమితాబచ్చన్, కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది జయప్రద. దాదాపు ఈమె ఎనిమిది భాషల్లో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటివరకు దాదాపు 300కు పైగా సినిమాలలో నటించిన జయప్రద తన మొదటి సినిమాకు పారితోషకంగా పది రూపాయలు తీసుకుంది.
13 ఏళ్ల అతి చిన్న వయసులో జయప్రద భూమి కోసం అనే సినిమాతో వెండితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాకు ముందు ఆమె నటించిన ఒక సినిమాకు పది రూపాయలు పారితోషకంగా తీసుకుంది. వెండితెర తో పాటు బుల్లితెర మీద కూడా ఎన్నో పాత్రలలో అద్భుతమైన నటన కనపరిచింది. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యురాలిగా జయప్రద తన బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాత ఈమె ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీలో చేరింది. ఆ తర్వాత జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ సభ్యురాలుగా కూడా ఎంపికయ్యారు.
2019 సంవత్సరంలో జయప్రద లోక్ సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. జయప్రద గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.మొదట కేవలం పది రూపాయల పారితోషకం తీసుకున్న జయప్రద ఆ తర్వాత కాలంలో ఇండియా లోనే ఖరీదైన హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది.ప్రస్తుతం ఈమెకు చెందిన ఈ వార్త సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది