Mega Family : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగి, ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషిస్తూ, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్న అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). #RRR చిత్రం తో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. గ్లోబల్ వైడ్ గా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకోవడం తో రామ్ చరణ్ కి సంబంధించిన మైనపు బొమ్మను ‘మేడమ్ తుస్సాడ్స్'(Madame Thussads) మ్యూజియం లో ఈ నెల 9 న ఆవిష్కరించబోతున్నారు. గత కొంతకాలం క్రితమే, మ్యూజియం అధికారులు రామ్ చరణ్ వద్దకు వచ్చి, ఆయన కొలతలను తీసుకొని వెళ్లారు. రామ్ చరణ్ తో పాటు అతని పెంపుడు కుక్క ‘రైమ్’ కూడా ఈ వ్యాక్స్ స్టాట్యూ లో భాగం కానుంది.
Also Read : జూన్ నెల నుండి రామ్ చరణ్, సుకుమార్ మూవీ..మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?
నాతో పాటు నా పెంపుడు కుక్క ఉంటేనే నేను ఈ వ్యాక్స్ స్టాట్యూ ని పెట్టుకోవడానికి అనుమతిని ఇస్తాను అంటూ రామ్ చరణ్ మ్యూజియం అధికారులతో చెప్పడం తో, వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు స్టైల్ గా రామ్ చరణ్ తన పెంపుడు కుక్క ‘రైమ్’ తో కలిసి సోఫా లో కూర్చున్న స్టిల్ కి సంబంధించిన కొలతలు తీసుకొని వెళ్లారు మ్యూజియం అధికారులు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ‘అన్ స్టాపబుల్’ షోలో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ మ్యూజియం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబెల్ స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. అయితే రామ్ చరణ్ మైనపు బొమ్మని మోనాలిసా మైనపు బొమ్మ పక్కనే ప్రతిష్టించబోతున్నారట. ఇది ఆయనకు దక్కిన మరో అరుదైన పురస్కారం గా భావించవచ్చు.
ఇకపోతే ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, క్లిన్ కారా ఈ నెల 8వ తేదీన రామ్ చరణ్ తో కలిసి వెళ్ళబోతున్నారు. ఈ ఈవెంట్ పూర్తి అయ్యాక ఆల్బర్ట్ హాల్ లో నిర్వహించే #RRR మూవీ లైవ్ పెర్ఫార్మన్స్ ని వీక్షించబోతున్నారు. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ప్రత్యేకంగా లైవ్ మ్యూజిక్ తో పాటు, పాటలు కూడా పాడనున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఇది ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో డీలాపడిన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ మూవీ గ్లింప్స్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ అరుదైన గౌరవం వారిలో ఉత్సాహాన్ని వంద రెట్లు ఎక్కువ చేసింది. మరో రెండు రోజుల్లో ఈ మైనపు బొమ్మ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ కానుంది.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తి..ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతాయా?