Spy Trailer : స్పై ట్రైలర్ రివ్యూ: స్వాతంత్య్రం ఒకరు ఇచ్చేది కాదు లాక్కునేది… రానా ఊహించని ఎంట్రీ!

దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనకున్న నిజాలు తెలుసుకోవడమే స్పై మూవీ ప్రధాన నేపథ్యం. బ్రిటీషర్స్ పై యుద్దానికి సిద్ధమవుతున్న సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారని ఒక వాదన ఉంది.

Written By: NARESH, Updated On : June 23, 2023 9:21 am
Follow us on

Spy Trailer : కార్తికేయ 2 మూవీతో హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. ఆయన వరుసగా భారీ చిత్రాలు ప్రకటిస్తున్నారు. జూన్ 29న స్పై మూవీతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యాడు. మూవీ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సాగింది. చివర్లో రానా ఎంట్రీ అదిరిపోయింది.

దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనకున్న నిజాలు తెలుసుకోవడమే స్పై మూవీ ప్రధాన నేపథ్యం. బ్రిటీషర్స్ పై యుద్దానికి సిద్ధమవుతున్న సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారని ఒక వాదన ఉంది. అలాగే మరికొన్ని థియరీలు ప్రచారంలో ఉన్నాయి. నిజాలు వెలికితీయడంలో భారత్ ఫెయిల్ అయ్యిందని కొందరు అంటారు. నిజం తెలిసినా దాన్ని రహస్యంగా ఉంచేశారని మరికొందరు అంటారు. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే.

ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని స్పై మూవీ తెరకెక్కింది. సుభాష్ చంద్రబోస్ ఎలా కనుమరుగయ్యాడ నే మిషన్ లో ఉన్న స్పై గా అఖిల్ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఫ్యామిలీ ఎమోషన్స్ కుదాజ్ జోడించారు. దేశం కోసం పని చేసే వ్యక్తిగా ఆర్యన్ రాజేష్ నటించాడు. అన్న ఆర్యన్ చావుకు కారకులైన వాళ్ళను నిఖిల్ కనుక్కోవాలని అనుకుంటాడు. దేశద్రోహులు అంతం చూసే గూఢచారిగా నిఖిల్ కనిపించనున్నాడు.

ఇక హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కథలో కీలకం అనిపిస్తుంది. ఐశ్వర్య మీనన్ తో రొమాన్స్, కెమిస్ట్రీ సైతం ఓ రేంజ్ లో ఉంది. ట్రైలర్ కి హైలెట్ గా రానా ఎంట్రీ నిలిచింది. స్వాతంత్య్రం ఒకరు ఇచ్చేది కాదు లాక్కునేది… ఈ మాట నేను అనలేదు. సుభాష్ చంద్రబోస్ అన్నాడు అని రానా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. సినిమాలో అఖిల్ ని కాపాడే సేవియర్ గా రానా తళుక్కున మెరిసే అవకాశం కలదు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించారు. కె రాజశేకర్ రెడ్డి కథ అందించారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడాను. మొత్తంగా స్పై ట్రైలర్ అంచనాలు పెంచేసింది.