https://oktelugu.com/

Kriti Sanon Mother: ఆదిపురుష్ మూవీ పై కృతి సనన్ తల్లి సంచలన వ్యాఖ్యలు..ట్రోల్ చేసేవాళ్ళకి అదిరిపోయే రేంజ్ కౌంటర్

బ్రాహ్మణుడి అయినా రావణాసురుడిని మాంసాహారి గా చూపించడం, రాముడికి మీసాలు ఉండడం, రావణాసురిడి 10 తలలను రెండు వరుసలుగా చూపించడం, ఇలాంటివన్నీ ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అంతే కాదు హనుమంతుడి క్యారక్టర్ చేత పలు సన్నివేశాల్లో చెప్పించిన డైలాగ్స్ కూడా ఇబ్బంది కరంగా ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 22, 2023 / 06:09 PM IST

    Kriti Sanon Mother

    Follow us on

    Kriti Sanon Mother: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ చిత్రం పై హిదు సంఘాలు నార్త్ ఇండియా లో విమర్శల దండయాత్ర మొదలు పెట్టారు. రామాయణం ని అపహాస్యం చేస్తూ తీసిన ఈ చిత్రాన్ని తక్షణమే బ్యాన్ చెయ్యాలి అంటూ హిందూ సంఘాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి వినతి పాత్రలను అందించారు.

    బ్రాహ్మణుడి అయినా రావణాసురుడిని మాంసాహారి గా చూపించడం, రాముడికి మీసాలు ఉండడం, రావణాసురిడి 10 తలలను రెండు వరుసలుగా చూపించడం, ఇలాంటివన్నీ ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అంతే కాదు హనుమంతుడి క్యారక్టర్ చేత పలు సన్నివేశాల్లో చెప్పించిన డైలాగ్స్ కూడా ఇబ్బంది కరంగా ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేసారు.

    అయితే ఈ విమర్శల పై ఈ చిత్రం లో సీత పాత్ర పోషించిన కృతి సనన్ తల్లి గీత సనన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆమె మాట్లాడుతూ ‘ జనాలు స్వచ్ఛమైన మనసుతో ఒక విషయాన్ని అధ్యయనం చెయ్యాలి. మనం సరైన దృష్టితో చూసినప్పుడే మనకి ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. శ్రీ రాముడు ఈ ప్రపంచం ప్రేమని పంచమని మనకి నేర్పించాడు.

    శబరి రాముడికి అందించిన ప్రేమని చూడాలి కానీ, వ్యక్తిలోని తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను గౌరవించండి, జై శ్రీ రామ్’ అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది, ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.చూడాలి మరి.