‘ఎన్టీఆర్ – త్రివిక్రమ్’ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ !

త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా మూవీ కోసం ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. అయితే ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నారని.. కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి కోన సీమ ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ పక్కా ఎంటర్ […]

Written By: Neelambaram, Updated On : October 5, 2020 8:02 pm
Follow us on


త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా మూవీ కోసం ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. అయితే ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నారని.. కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి కోన సీమ ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ పక్కా ఎంటర్ టైనర్ గా తీసే ప్లాన్ లో ఉన్నాడట. సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఒకటి అమెరికాలో ఉండే కమర్షియల్ బిజినెస్ మెన్ గెటప్ కాగా, మరొకటి పల్లెటూరి కుర్రాడి పాత్ర అట.

Also Read: ఏంటసలు?: ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. రేపటి వరకు ఉత్కంఠ

కాగా బిజినెస్ మెన్ అయిన తారక్ పాత్ర ఇండియాకి వస్తాడని.. అయితే పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరోకి ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందని అందుకే రాజకీయాలనే తన వ్యాపారంగా మలుచుకుంటాడాని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నుండి వచ్చే హీరో కథే ఈ సినిమా కథ అని.. కాకపోతే మరో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందని.. మధ్యలోనే ఆ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఇక అప్పటి నుండే తారక్ పాలిటిక్స్ నే బిజినెస్ గా మార్చుకుని ప్రజలను కూడా కస్టమర్లుగా మార్చేస్తాడట. అయితే చివర్లో హీరో చేసిన ప్రతి చెడు పనికి ఒక మంచి ఉంటుందని.. అది ట్విస్ట్ గా రివీల్ అవుతుందని సమాచారం.

Also Read: ఫ్యాన్స్ కోసం చేస్తానంటున్న మాజీ హీరోయిన్ !

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని పర్సన్ లా కూడా కనిపించబోతున్నాడట. అసలు తారక్ అమెరికా నుండి ఇండియాకి దేని కోసం వచ్చాడు అనేది కూడా సినిమాలో మెయిన్ ఎమోషన్ గా ఉంటుందని.. కాస్త ఆధ్యాత్మిక టచ్ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెట్టి.. నేటి రాజకీయాలను వాడుకుని ప్రజలను ఎలా బఫూన్ చేశాడు.. ప్రస్తుత రాజకీయ నాయకులు అలాగే చేస్తున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడట.మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తోన్నారు.