స్ట్రోక్ లేని ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీనే !

మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, ఆ హీరో ఎలా ఉన్నాడు, ఎలా నటించాడు.. ఒకవేళ ఆ కొత్త హీరో నటన బాగుంటే చాలు ఇక అతను స్టార్ అయిపోయినట్టే. లేకపోతే ఆ ఫ్యామిలీకే లాస్. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారుసల నుండి వచ్చే స్ట్రోక్స్ దెబ్బకు మహామహులే కుదలైపోయారు. ఎలాగైనా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను […]

Written By: Neelambaram, Updated On : October 5, 2020 8:11 pm
Follow us on


మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, ఆ హీరో ఎలా ఉన్నాడు, ఎలా నటించాడు.. ఒకవేళ ఆ కొత్త హీరో నటన బాగుంటే చాలు ఇక అతను స్టార్ అయిపోయినట్టే. లేకపోతే ఆ ఫ్యామిలీకే లాస్. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారుసల నుండి వచ్చే స్ట్రోక్స్ దెబ్బకు మహామహులే కుదలైపోయారు. ఎలాగైనా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్న దర్శకనిర్మాతలు ఇప్పటికే ఎంతోమందిని చూశాము. ఎప్పటికీ అలాంటి వారిని చూస్తూనే ఉంటాము. ఎందుకంటే తమ ఫ్యామిలీలో ఒక హీరో ఉన్నాడనే అనే పేరు అంత కిక్ ను ఇస్తోంది మరి.

Also Read: ‘అల్లు’ స్టూడియో.. చాలా కాస్టీ గురూ..!

అయితే ఇప్పటికే ఒకే కుటుంబం నుండి డజను మంది హీరోలు వచ్చినా అలాంటి ఒక్క వారసుడి స్ట్రోక్ కూడా తగలకుండా ఉంది మెగా కుటుంబం ఒక్కటే అనుకుంటా. వచ్చిన ప్రతి హీరో ఎంతోకొంత తన లెవల్ కి తగట్లు సక్సెస్ ను తెచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’కి బాగానే గిట్టుబాటు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. ఈ సినిమాకి సదరు ఓటిటి సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ కూడా మొదటి సినిమాతోనే మార్కెట్ ను తెచ్చుకున్నాడు.

Also Read: చరణ్ పై షూట్.. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ?

ఇక నాని ‘వి’తో మొదలైన డిజిటల్ విడుదల పరంపరలో మొత్తానికి ఉప్పెన కూడా చేరబోతోంది అన్నమాట. ఇక ఈ సినిమాలో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని.. వైష్ణవ్ తేజ్ కూడా బాగా చేశాడని తెలుస్తోంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుండే సరికి ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి.