Spirit : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ప్రతి హీరో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించాలనే ప్రయత్నం చేస్తున్నారు…దర్శకుల విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఎక్కడ తగ్గకుండా బాలీవుడ్ మాఫియా కి గట్టి పోటీ ఇస్తూ తన సక్సెస్ లతోనే వాళ్లకు సరైన గుణపాఠం చెబుతూ ముందుకు సాగుతున్నాడు…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga) ఆయన చేసిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసే ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక యూత్ లో ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సినిమాల ద్వారానే కాకుండా ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఎవ్వరికీ భయపడకుండా చాలా క్లియర్ గా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే ఏకైక దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనే ప్రశ్నలైతే ప్రభాస్ అభిమానుల్లో కలుగుతున్నాయి.
వాళ్ళందరికి భరోసాని ఇస్తూ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తానో మీ ఊహకు కూడా అందదు అంటూ సందీప్ వంగ చెప్తున్న మాటలు ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఐదు నిమిషాల గెస్ట్ అప్పిరియన్స్ పాత్ర అయితే ఉందట.
దానికోసం బాలీవుడ్ హీరో అయిన రణబీర్ కపూర్ ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన చేస్తాడా లేదంటే ఇంకే వేరే బాలీవుడ్ హీరో చేస్తాడా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికి అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉందట. దాన్ని ఒక స్టార్ హీరో చేస్తేనే అది బ్యాలెన్స్ అవుతుందనే ఉద్దేశ్యంతో సందీప్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ ను కూడా సందీప్ కంప్లీట్ వస్తున్నారట. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో వీళ్లిద్దరి కాంబో మరోసారి భారీ విజయాన్ని దక్కించుకుంటుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : వైరల్ అవుతున్న ‘స్పిరిట్ ‘ మూవీ సన్నివేశం..ప్రభాస్ ని ఇంత క్రూరంగా ఎప్పుడు చూసుండరు!