Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రానికి ఉన్నంత క్రేజ్ ఏ సినిమాకి లేదు అనొచ్చు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ’ పేరు కనిపిస్తే ఎలా పూనకలొచ్చి ఊగిపోతారో, ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తే అలా ఊగిపోతారు. సందీప్ వంగ(Sandeep Reddy Vanga) లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో సినిమా అంటేనే అభిమానులు సన్నివేశాలను ఊహించేసుకుంటున్నారు. పైగా కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ(Don Lee) ఇందులో నటిస్తున్నాడు అనే వార్త వచ్చినప్పటి నుండి అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఈ అంశం. ఈ చిత్రం లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా వయొలెంట్ గా ఆయన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాడు సందీప్ వంగ.
అయితే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ గెటప్ ఎలా ఉండబోతుంది అనే ఊహతో కొన్ని ఫోటోలను, వీడియోలను క్రియేట్ చేసారు అభిమానులు. ప్రభాస్ నిజంగా సెట్స్ లో కూడా ఈ రేంజ్ గ్లామర్ తో ఉండడేమో. అంత అద్భుతంగా, సహజం గా అవి ఉన్నాయి. అయితే రీసెంట్ గా ప్రభాస్, డాన్ లీ లు స్పిరిట్ మూవీ సెట్స్ లో ఎలా ఉంటారు అనే దానిపై ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ని తయారు చేసి సోషల్ మీడియా లో వదిలారు అభిమానులు. ఈ వీడియో చాలా ఫన్నీ గా అనిపించింది. షూటింగ్ సెట్స్ లో భీభత్సమైన పోరాటాలు చేసి అలిసిపోయిన ప్రభాస్, రాత్రి తనతో పాటు డాన్ లీ ని ఫుడ్ పార్టీ కి తీసుకెళ్లడం, ఆయనకు పొట్టపగిలేలా భోజనాలు పెట్టించడం, డాన్ లీ అది తట్టుకోలేక కడుపునొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు చూపించడం చాలా ఫన్నీ గా అనిపించింది.
ప్రభాస్ తన సన్నిహితులకు చేసే అతిథి మర్యాదల గురించి అభిమానులు ఎన్నో ఫన్నీ ట్రోల్స్ గతంలో వేశారు. వాటి అన్నిటికంటే ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ‘రాజా సాబ్’ చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కరెక్ట్ గా జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలయ్యేది. కానీ ప్రభాస్ కాళ్లకు దెబ్బలు తగలడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ కాస్త షూటింగ్ బ్యాలన్స్ ఉంది. విదేశాల నుండి తిరిగి రాగానే ఆయన ‘రాజా సాబ్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన హను రాఘవపూడి తో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, ఆయన ‘స్పిరిట్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
Orey evadra chesindhi fb lo chusa #Prabhas pic.twitter.com/OkPHsgmtLq
— Darling Fanss (@DarlingFanss1) February 17, 2025