Spirit Movie Franchise: యూత్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించే దర్శకులలో ఒకరు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). అర్జున్ రెడ్డి చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన, మొదటి సినిమా తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత అదే సినిమాని హిందీ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని కొట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన నుండి వచ్చిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనమంతా చూసాము. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ ఉంటుందని, రెండవ పార్ట్ పేరు ‘యానిమల్ పార్క్’ అని కూడా అధికారిక ప్రకటన చేసాడు సందీప్ వంగ. ఈమధ్య కాలం లో ఒక సినిమా సూపర్ హిట్ అయ్యి, ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటే, ఆ చిత్రం క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ డైరెక్టర్స్ ఫ్రాంఛైజ్ లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చింది. ఈ యూనివర్స్ నుండి ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలు వచ్చాయి. త్వరలోనే ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 వంటి చిత్రాలు కూడా ఈ యూనివర్స్ నుండి రాబోతున్నాయి. అదే విధంగా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సాహూ, ఓజీ చిత్రాలు వచ్చాయి. త్వరలోనే ఓజీ 2 , ఓజీ 3 లు కూడా ఈ ఫ్రాంచైజ్ నుండి రాబోతున్నాయి. ఇలా డైరెక్టర్స్ అందరూ ఫ్రాంచైజ్ ట్రెండ్ లో ఉన్నారు. సందీప్ వంగ కూడా యానిమల్ ఫ్రాంచైజ్ తో పాటు, ‘స్పిరిట్'(Spirit Movie) ని కూడా ఒక ఫ్రాంచైజ్ లాగా తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడట. స్పిరిట్ చిత్రం లో ప్రభాస్(Rebel Star Prabhas) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ ని ఒక సస్పెన్స్ ఎలిమెంట్ తో ముగించి, పార్ట్ 2 కి లీడింగ్ ఇచ్చేలా చెయ్యాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట.
కేవలం రెండు మూడు సినిమాలతో ఈ కాపీ యూనివర్స్ ముగిసిపోదు. చాలా పెద్ద యూనివర్స్ గా తీర్చి దిద్దాలనే ప్లాన్ లో ఉన్నాడట సందీప్ వంగ. ఈ యూనివర్స్ లో ఇతర హీరోలు కూడా భాగం కాబోతున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో ఒక సినిమా చేయడానికి సందీప్ వంగ అగ్రిమెంట్ చేసుకున్నాడు. స్పిరిట్ చిత్రం పూర్తి అవ్వగానే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది ‘స్పిరిట్’ యూనివర్స్ నుండి వస్తుందా?, లేకపోతే ప్రత్యేకమైన సినిమానా? అనేది ఇప్పుడే చెప్పలేము. చూడాలి మరి సందీప్ వంగ యూనివర్స్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకర్షిస్తుంది అనేది.