Salaar 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ని సైతం ఏలే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఆయన బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వాళ్లకంటే తను ముందు వరుసలో ఉన్నానని ప్రతిసారి వాళ్లకు గుర్తు చేస్తూ వస్తున్నాడు… ఇక రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరోసారి షేక్ చేయాలని చూస్తున్నాడు…
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 5 ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ (Salaar) సినిమా మంచి విజయాన్ని సాధించింది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా 700 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచిపోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘సలార్ 2’ సినిమా కూడా రాబోతుందంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక సలార్ మొదటి పార్ట్ లో పృథ్విరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఇద్దరూ ఫ్రెండ్స్ గా కనిపించినప్పటికి రెండో పార్ట్ లో మాత్రం ఇద్దరు బద్ధ శత్రువులుగా కనిపించబోతున్నారనేది మొదటి పార్ట్ ఎండింగ్ లో మనకు చూపించారు. మరి ఈ క్రమంలోనే పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో చనిపోతాడా అనే కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి మొదటి పార్ట్ లో వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ని చూపించిన దర్శకుడు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ చేతిలో పృధ్వీ రాజ్ చనిపోబోతున్నాడా అనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు భారీ సినిమాలను చేస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాతో కూడా మరోసారి పెను ప్రపంభజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. తద్వారా ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం పోటీపడుతూ ఉండడం విశేషం. అయితే సలార్ 2 సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలువబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ తన తదుపరి సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…
Also Read: ప్యారడైజ్ సినిమా లో ఆ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడా..?