Homeఎంటర్టైన్మెంట్Pushpa: 'పుష్ప'రాజ్​కు పోటీగా బరిలోకి 'స్పైడర్​మ్యాన్'​

Pushpa: ‘పుష్ప’రాజ్​కు పోటీగా బరిలోకి ‘స్పైడర్​మ్యాన్’​

Pushpa: కరోనా కారణంగా వచ్చిన గ్యాప్​ వల్లనో.. లేక వరుసగా అవకాశాలు రావడం వల్లనో తెలియదు కానీ, బాక్సాఫీసు వద్ద డిసెంబరు, జనవరి నెలల్లో గట్టిపోటీ తప్పడం లేదు. వరుసగా స్టార్​ హీరోల సినిమాలతో పాటు, చిన్న సినిమాలూ రంగంలో దిగనున్నాయి. ఈ క్రమంలోనే  సినిమా వార్​ వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం వల్ల నిర్మాతలంతా సమావేశమై చిత్రాల విడుదలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా జనవరిలో విడుదలయ్యే చిత్రాల విషయంలో ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, పుష్పరాజ్​ను ఢీ కొట్టేందుకు హాలీవుడ్​ హీరో సిద్ధమయ్యారు.

pushpa

డిసెంబరు 17న పుష్ప సినిమా విడుదలకు సిద్ధం కాగా.. అదే రోజు మోస్ట్​ అవైటెడ్​ సూపర్​ హీరో మూవీ స్పైడర్​ మ్యాన్​ కూడా బరిలోకి దిగనున్నారు. తాజాగా, “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” కొత్త ట్రైలర్ విడుదలైంది. ఇందులో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో డిసెంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజు పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న పుష్ప కూడా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది.  స్పైడర్​ మ్యాన్​కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్​ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు, అల్లు అర్జున్​ పుష్ప సినిమాపైనా అదే రేంజ్​లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బాక్సాఫీసు వద్ద పుష్పకు గట్టిపోటీ నెలకొందనే చెప్పాలి.

SPIDER-MAN: NO WAY HOME - Official Telugu Trailer | In Cinemas December 17

సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఇందులో రష్మిక హీరోయిన్​గా నటించనుంది. కాగా, దేవి శ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version