అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికీ బన్నీ ఊర మాస్ గెటప్ లో దర్శనమిచ్చిన ట్రైలర్లు, ‘దాక్కో మేక’ అనే పాట వైరల్ అయ్యింది. బన్నీ గంధపు చెక్కల దొంగగా బీభత్సమైన పాత్రలో కనిపించి అలరించేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.మొదటి పార్ట్ దాదాపుగా పూర్తికావచ్చింది.వచ్చే క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ డిసెంబర్ లో విడుదల కానుంది.

తాజాగా పుష్ప చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది అందరిని మొదటి చూపులోనే ఆకర్షించేలా డిజైన్ చేశారు. ఎంతో అందమైన రష్మికను ఈ చిత్రంలో పూర్తిగా డిగ్లామర్ గా చూపించారు. అయితే అద్భుతమైన పల్లెటూరి పిల్లగా రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె పోస్టర్ చూస్తుంటే ఒక పూరి గుడిసెలో పెళ్లి చూపులకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. కింద చీర, పూలు కనిపించాయి. వెనుక కట్టెల పొయ్యిలో వంట చేస్తున్నారు.
ఇక ‘పుష్ప’ సినిమాలో రష్మిక పాత్ర పేరు ‘శ్రీవల్లి’గా చిత్రం యూనిట్ రివీల్ చేసింది. రష్మిక లుక్ చాలా వినూత్నంగా.. మంచి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. శ్రీవల్లి పాత్రలో చీరకట్టులో ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ కు పోటీగా విలన్ గా మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఫహద్ ఫస్ట్ లుక్ విడుదలై ఆదరణ పొందింది. ఇక కన్నడ నటుడు ధనంజుయ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళీ భాషల్లో విడుదల చేస్తున్నారు. హిందీలోనూ విడుదల చేయాలని ప్యాన్ ఇండియా సినిమాగా మలుస్తున్నారు.
Our fiercest #PushpaRaj's heart melts at the sight of his love ❤️
Meet @iamRashmika as #Srivalli 😍#SoulmateOfPushpa #PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/TFqIGaGGyF
— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021