spot_img
Homeఎంటర్టైన్మెంట్South Stars: బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి వెండితెరను ఏలుతున్న సౌత్ స్టార్స్...!

South Stars: బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి వెండితెరను ఏలుతున్న సౌత్ స్టార్స్…!

South Stars:  ఒకప్పటి బుల్లితెర నటులు ప్రస్తుతం వెండితెరను ఏలేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ గా, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, స్టార్ హీరోలుగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చిన్న చిన్న పాత్రలతో, కార్యక్రమాలతో మొదలైన వాళ్ళ కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంది. టెలివిజన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి స్టార్స్ గా ఎదిగిన సౌత్ ఇండియా స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

South Stars
South Stars

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా భారీ ఫేమ్ తెచ్చుకుంది నయనతార. సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె రికార్డులకు ఎక్కారు. అయితే నయనతార కెరీర్ మొదలైంది ఒక టెలివిజన్ హోస్ట్ గా. ‘చమయం’ అనే మలయాళ టెలివిజన్ షోకి నయనతార హోస్ట్ గా చేస్తున్న సమయంలో ఆమెకు ‘మనస్సింకారే’ అనే మూవీ ఆఫర్ రావడం జరిగింది. అలా నటిగా మారిన నయనతారకు చంద్రముఖి, గజినీ, లక్ష్మి వంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి.

దేశం మెచ్చిన నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ తమిళ చిత్ర పరిశ్రమకు రాకముందు దూరదర్శన్ లో కన్నడ సీరియల్స్ లో నటించాడు. ఆయన నటించిన సీరియల్స్ బిసులు కుడురే, గుడ్డాడ భూత బుల్లితెరపై ప్రసారం అయ్యాయి. 1988లో ఓ కన్నడ చిత్రంతో ప్రకాష్ రాజ్ నటుడిగా మారారు.

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారిన హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించారు. ఆమె షకలక భూమ్ భూమ్, కరిష్మా కా కరిష్మా వంటి సీరియల్స్ ప్రాచుర్యం పొందాయి. తెలుగు తమిళ భాషల్లో హన్సిక టాప్ హీరోయిన్ హోదా దక్కించుకున్నారు.

కెజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న యష్ కెరీర్ మొదలైంది బుల్లితెరపైనే. యష్ ఈటీవీ కన్నడలో ప్రసారమైన నంద గోకుల సీరియల్ లో నటించారు. 2007లో విడుదలైన కన్నడ చిత్రం జంబాడ హుడిగి తో వెండితెర ఎంట్రీ ఇచ్చి.. స్టార్ గా ఎదిగాడు.

నటుడు మాధవన్ ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ గా కొనసాగారు. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న మాధవన్ సినిమాల్లోకి రాకముందు అనేక హిందీ సీరియల్స్ లో నటించారు. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన మాధవన్ కి చెలి మూవీతో హీరోగా బ్రేక్ దక్కింది.

 

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్ టెలివిజన్ డాన్స్ రియాలిటీ షోలతో ప్రారంభమైంది.తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోయిన్ గా మారింది. మలయాళ చిత్రం ప్రేమమ్ సాయి పల్లవిని హీరోయిన్ గా నిలబెట్టింది. తెలుగులో ఫిదా చిత్రంతో సాయి పల్లవి నిలదొక్కుకున్నారు.

Also Read: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే వారసుడు అతనేనా..?

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కెరీర్ మొదలైంది బుల్లితెర ద్వారానే. సన్ టీవీలో ప్రసారమైన తమిళ సీరియల్ పెన్ లో ఆయన నటించారు. అలాగే మరికొన్ని టీవీ సీరియల్స్ లో విజయ్ సేతుపతి నటించడం జరిగింది. ఇక వెండితెరపై అనేక చిన్న చిన్న పాత్రలు చేశాడు. 2010లో విజయ్ సేతుపతికి హీరోగా అవకాశం దక్కింది.

తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్నారు శివ కార్తికేయన్. ఆయన లేటెస్ట్ మూవీ డాక్టర్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. శివ కార్తికేయన్ కెరీర్ బుల్లితెరపై స్టాండప్ కమెడియన్ గా మొదలైంది. 2012లో విడుదలైన ‘మారిన’ మూవీతో హీరోగా అవకాశం దక్కింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి.

Also Read:  ప్రపంచం మీదకు ప్రాణాలు తీసే మరో మహమ్మారి ‘డెల్టాక్రాన్’

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version