RTC fares: పెట్రో ధరల పెరుగుదలతో అన్ని వ్యవస్థలు అల్లాడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్రో భారంతో కుదేలయిపోతున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ కూడా పెనుభారం మోస్తోంది. పెట్రో ధరల పెరుగుదలతో అదనపు భారం మోస్తున్నాయి. దీంతో సంస్థ పీకల్లోతు కష్టాల్లో పడిపోతోంది. ఈ క్రమంలో సంస్థలను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ సంస్థ మనుగడపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనికి గాను సంస్థ అభివృద్ధి సాధించాలంటే చార్జీల పెంపే మార్గమని భావించారు. దీంతో ప్రయాణికులపై భారం పడినా సంస్థ మనుగడ దృష్ట్యా పెంచక తప్పని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అందుకే ప్రయాణ చార్జీలు పెంచక తప్పడం లేదని తెలుస్తోంది.
కనిష్టంగా రూ.15 గరిష్టంగా రూ.25 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఆర్డినరీ బస్సుల్లో కనీసం చార్జీలు రూ.10 ఉండగా దాన్ని రూ. 15 పెంచాలని చూస్తోంది. మెట్రో డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీ రూ.15 ఉండగా దాన్ని రూ.25కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.25కు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Politics: వడ్ల చుట్టే రాజకీయం.. రైతులతో ఇరు పార్టీల చెలగాటం..
ఆర్టీసీని రక్షించే ప్రయత్నంలో భాగంగానే చార్జీల పెంపు అనివార్యమవుతోంది. ఇందుకు గాను చార్జీల పెంపు ప్రతిపాదన సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. ఆయన నుంచి ఆమోదం రాగానే చార్జీల పెంపు జరుగుతుందని సమాచారం. పెట్రో ధరల పెరుగుదలతో ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు గాను ప్రణాళిక రెడీ అయినట్లు తెలుస్తోంది.
Also Read: Telangana: తెలంగాణల మరిన్ని ఉప ఎన్నికలకు బీజేపీ సమాయత్తం?