South Stars- Side Business: ఆ పని చేసి కోట్లు సంపాదిస్తున్న సౌత్ స్టార్స్ వీళ్ళే !

South Stars- Side Business: ‘ఒకే ఆదాయ వనరు పై ఆధారపడటం, చిల్లు పడిన పడవ పై సముద్రాన్ని ఈదాలి అనుకోవడం ఒక్కటే’ అంటాడు ప్రముఖ ఆర్థిక నిపుణులు ‘వారెన్ బఫెట్’. అందుకే.. మన హీరోలు కూడా వివిధ ఆదాయ వనరులను ప్లాన్ చేసుకున్నారు. ఇటు సినిమాలతో సంపాదిస్తూనే.. అటు వ్యాపారాల్లోనూ బాగా సంపాదిస్తూ ముందుకు పోతున్నారు. మరి మన హీరోల వ్యాపార సంగతులేమిటో తెలుసుకుందాం రండి. మెగాస్టార్‌ చిరంజీవి : మెగాస్టార్‌ చిరంజీవికి ఒక సినిమా […]

Written By: Shiva, Updated On : May 9, 2022 11:16 am
Follow us on

South Stars- Side Business: ‘ఒకే ఆదాయ వనరు పై ఆధారపడటం, చిల్లు పడిన పడవ పై సముద్రాన్ని ఈదాలి అనుకోవడం ఒక్కటే’ అంటాడు ప్రముఖ ఆర్థిక నిపుణులు ‘వారెన్ బఫెట్’. అందుకే.. మన హీరోలు కూడా వివిధ ఆదాయ వనరులను ప్లాన్ చేసుకున్నారు. ఇటు సినిమాలతో సంపాదిస్తూనే.. అటు వ్యాపారాల్లోనూ బాగా సంపాదిస్తూ ముందుకు పోతున్నారు. మరి మన హీరోల వ్యాపార సంగతులేమిటో తెలుసుకుందాం రండి.

South Stars

మెగాస్టార్‌ చిరంజీవి :

Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవికి ఒక సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది. పేరు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’. అలాగే కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకి చిరు ‘సహ యజమాని’గా కూడా వ్యవహరిస్తున్నారు.

Also Read: Nagma: యంగ్ హీరోతో నగ్మా రొమాన్స్.. ఇది షాకింగ్ విషయమే !

అక్కినేని నాగార్జున :

Nagarjuna

నాగార్జున అంటేనే పెద్ద బిజినెస్ మెన్. నాగార్జున చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. పైగా, నాగార్జున చేసిన వ్యాపారాలు అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఎన్‌ గ్రిల్స్‌’ పేరుతో నాగ్ కి రెస్టారెంట్లు ఉన్నాయి. పైగా హైదరాబాద్‌లోని ‘ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’ కూడా నాగార్జునదే. ఇక కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు నాగార్జున కూడా సహ యజమానిగా ఉన్నాడు.

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు :

Mohan Babu

మోహన్‌ బాబు బిజినెస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబుకి ప్రొడక్షన్‌ హౌస్‌ తో పాటు శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. హీరోగా మోహన్ బాబు సూపర్ సక్సెస్ కాకపోయినా.. బిజినెస్ మెన్ గా మాత్రం ఆయన సూపర్ సక్సెసే.

జగపతి బాబు :

jagapathi babu

జగపతి బాబు హీరో కాకముందు ఫర్నిచర్ వ్యాపారం చేశాడు. కాకపోతే.. అందులో ఆయన ఫెయిల్ అయ్యారు అనుకోండి. ఆ తర్వాత హీరోగా మారి ఒక వెలుగు వెలిగారు. మళ్లీ, విలన్‌గా రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఐతే, జగపతి బాబు ఇటీవల టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని సార్ట్ చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు :

Mahesh Babu

మహేష్ బాబు మంచి బిజినెస్ మెన్. ఏ హీరో ఊహకి అందని సమయంలోనే హైదరాబాద్ లో ‘ఏ.ఎమ్.బి’ అనే భారీ మల్టీ ఫ్లెక్స్ కట్టించాడు. ఇప్పుడు భాగ్యనగరంలో ‘ఏ.ఎమ్.బి’ మాల్ ఓ ఐకానిక్ థియేటర్ గా మారిపోయింది. అలాగే, మహేష్‌ కి సినీ నిర్మాణ సంస్థ ‘జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌’ కూడా ఉంది.

రామ్‌ చరణ్‌ :

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ లో మంచి వ్యాపారవేత్త ఉన్నాడు. ‘ట్రూజెట్‌’ పేరుతో చరణ్ ఎయిర్‌లైన్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. అలాగే చరణ్ కి పోలో క్లబ్‌ కూడా ఉంది. ఇది ప్రస్తుతం ఫుల్ సక్సెస్ లో ఉంది. ఎయిర్‌లైన్స్ వ్యాపారం మాత్రం నష్టాల్లో ఉంది.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్‌’ :

Allu Arjun

ఎప్పుడూ సరదాగా కనిపించే అల్లు అర్జున్‌ లో కూడా మంచి బిజినెస్ మెన్ ఉన్నాడు. బన్నీ ‘ఎం.కిచెన్‌’ పేరుతో ఇంటర్నేషనల్‌ బ్రూవింగ్‌ కంపెనీని స్టార్ట్ చేశాడు. పైగా, బన్నీ కంపెనీ కింద బ్రూవింగ్‌, నైట్‌ క్లబ్‌, రెస్టారెంట్‌ కూడా నడుస్తున్నాయి.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ :

Kalyan Ram

నందమూరి ఫ్యామిలీలో బిజినెస్ మెన్ గా రాణిస్తున్న హీరోల్లో ‘కల్యాణ్‌ రామ్‌’ ఒక్కడే. కల్యాణ్‌ రామ్‌ కి ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ పలు చిత్రాలను నిర్మించారు. ఐతే, ‘కళ్యాణ్ రామ్’ లాభాలు కంటే నష్టాల్నే ఎక్కువ చవి చూశాడు. అన్నట్టు కల్యాణ్ రామ్‌కు ‘వీఎఫ్‌ఎక్స్‌’ వ్యాపారం ఉంది. ఈ వ్యాపారం మాత్రం ఆయనకు మంచి లాభాలను అందిస్తోంది.

రానా :

Rana Daggubati

నేషనల్ రేంజ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా.. వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. చిన్నతనం నుంచే రానాకి వ్యాపారంపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితో ఆయన ముంబైలో ‘టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ’ని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ప్రస్తుతం లాభాల్లో ఉంది.

విజయ్‌ దేవరకొండ :

Vijay Devarakonda

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా హీరో అయ్యి.. స్టార్ గా ఎదిగి.. సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేయడం అంటే చాలా కష్టం. అలాంటిది.. ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపారంపై కూడా విజయ్ దేవరకొండ దృష్టి పెట్టి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా రాణిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ ను స్టార్ట్ చేశాడు. ఈ వ్యాపారం ప్రస్తుతం లాభాల్లో నడుస్తోంది.

ఆర్య :

Arya

‘ఆర్య’కు సౌత్ ఇండియా రెస్టారెంట్ అనే ‘సీ షెల్’ ఉంది. అలాగే ఆర్యకి ‘ది షో పీపుల్’ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. తన బ్యానర్‌లో ఆయన కొన్ని విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

తమిళ స్టార్ హీరో ‘విజయ్’ :

Vijay

 

చెన్నైలో పలు చోట్ల విజయ్ కి ‘కళ్యాణ మండపాలు’ ఉన్నాయి. అలాగే కొన్ని హాల్స్‌ కూడా విజయ్ కి ఉన్నాయి. వీటికి తన తల్లి శోభ, భార్య సంగీత మరియు కుమారుడు సంజయ్‌ పేర్లును పెట్టాడు. విజయ్ ‘మక్కల్ ఇయక్కమ్’ అనే సామాజిక సంక్షేమ గ్రూప్ ను కూడా స్థాపించాడు.

పాప్ సింగర్ స్మిత :

Smita

సింగర్ గా మరియు నటిగానే కాదు, వ్యాపారవేత్తగా కూడా ‘స్మిత’ రాణిస్తోంది. ‘ICandy Entertainment Pvt.Ltd ‘ అనే ప్రొడక్షన్ హౌస్‌ ను స్మిత నడుపుతోంది. అలాగే.. సంగీతం, కళలు, యోగా మరియు డ్యాన్స్ క్లాస్ లు నిర్వహించే M.A.D అనే పాఠశాలను కూడా స్మిత నడుపుతున్నారు.

Also Read:Bhala Thandanana: ప్చ్.. పరిణతి పెరిగింది.. సినిమా ప్లాప్ అయ్యింది !

Tags