https://oktelugu.com/

Private Jet: సొంతంగా విమానాలు ఉన్న తెలుగు హీరోలెందరో తెలుసా?

Private Jet: మన తెలుగు హీరోలు అత్యంత సంపన్నులు. వారి పారితోషికం కోట్లలోనే ఉండటంతో వారి జీవితం కూడా అదే రేంజ్ లో ఉంటోంది. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సరదాగా జాలీ ట్రిప్పులకు వెళ్తూ సందడి చేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సహా వెళ్తూ విడిది చేస్తుంటారు. మన తెలుగు హీరోల్లో చాలా మందికి ప్రైవేటు విమానాలు ఉన్నాయంటే వారి సంపాదన ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు వారి ప్రైవేటు జెట్ లలో ప్రయాణిస్తుంటారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2022 / 05:35 PM IST
    Follow us on

    Private Jet: మన తెలుగు హీరోలు అత్యంత సంపన్నులు. వారి పారితోషికం కోట్లలోనే ఉండటంతో వారి జీవితం కూడా అదే రేంజ్ లో ఉంటోంది. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. సరదాగా జాలీ ట్రిప్పులకు వెళ్తూ సందడి చేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సహా వెళ్తూ విడిది చేస్తుంటారు. మన తెలుగు హీరోల్లో చాలా మందికి ప్రైవేటు విమానాలు ఉన్నాయంటే వారి సంపాదన ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు వారి ప్రైవేటు జెట్ లలో ప్రయాణిస్తుంటారు.

    private jet these telugu stars

    తెలుగు హీరోలలో చాలా మందికి విమానాలు ఉన్నాయి. దీంతో వారు సరదాగా కుటుంబంతో గడపడానికి పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. షూటింగులు లేనప్పుడు భార్యా పిల్లలతో కలిసి టూర్లు వేస్తుంటారు. మెగా హీరో చిరంజీవికి ప్రైవేటు విమానం ఉంది. దాన్ని రాంచరణ్ వాడుతుంటాడు. ఎటైనా వెళ్లేటప్పుడు దానిలో వెళ్తుంటాడు. ఇక అల్లు అర్జున్ కు కూడా ఓ ప్రైవేటు విమానం ఉంది. దీంతో ఆయన కూడా దానిలో సరదా ట్రిప్పులు వేస్తుంటాడు. కుటుంబంతో కలిసి వెళ్తూ సందడి చేస్తుంటాడు.

    అక్కినేని హీరోలకు కూడా ఓ ప్రైవేటు విమానం ఉంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి చాలా సందర్భాల్లో ఇందులోనే ప్రయాణం చేస్తుంటారు. అంతేకాదు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కూడా ఓ ప్రైవేటు జెట్ ఉంది. బాహుబలి తరువాత అతడు దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాని దగ్గర అప్పుడప్పుడు ఫొటోలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా ఓ విమానం ఉంది. ఎక్కువగా విహార యాత్రలకు వెళ్లే సమయంలో ఇందులో ప్రయాణిస్తుంటాడు.

    private jet these telugu stars

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఓ జెట్ ఉంది. దీని విలువ రూ. 80 కోట్లని తెలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ఓ జెట్ కొనుగోలు చేశాడు. ఓసారి అందులో ప్రయాణించిన విజయ్ అభిమానులను అలరించాడు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క నయనతారకు మాత్రమే జెట్ ఉంది. ఇంకా ఎవరు కూడా జెట్లు వాడటం లేదు. మొత్తానికి మన తెలుగు హీరోల్లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు జెట్లతో మన హీరోలు రివ్వున దూసుకెళ్తున్నారు. తమకు నచ్చిన ప్రాంతాలను చుడుతూ ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం.

    Tags