Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. సౌత్ సినీ సంగీత ప్రపంచంలో తిరుగులేని స్టార్ ఆయన. నేటికీ మేటిగా ఆయన ముద్ర చూపిస్తూనే ఉన్నారు. అయితే, ఇళయరాజా మీద ఓ ఆరోపణ ఉంది. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ను బట్టి సినిమాకి సంగీతం చేస్తాడు అని. అందులో నిజానిజాలు ఏమిటి అనేది పక్కన పెడితే.. ఇళయరాజా మాత్రం అత్యంత వేగంగా సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తాడు.

కానీ, తక్కువ డబ్బులు ఇచ్చారు కదా, అందుకే అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించి సంగీతం కొట్టేస్తారు అనే ఈ పేరు ఎంతవరకు వాస్తవం ?. ఎలాంటి వాస్తవం లేదు. ఉదాహరణకు ఇళయరాజా గారు కృష్ణవంశీ “రంగమార్తాండ” సినిమా కోసం సంగీతం అందించారు. మరి ఆయన గీతాలకు ఎలా స్వరకల్పన చేశారో తెలుసా ?
ఓ పాట కోసం నాలుగు నెలల సమయం తీసుకున్నారు. కాసర్ల శ్యామ్ రాసిన మరో పాట కోసం మాత్రం కేవలం మూడు గంటల సమయం మాత్రమే తీసుకున్నారు. ముందుగా ఆయన పాటను తమిళంలో రాసుకుంటారు. నిజానికి ఇళయరాజా గారికి తెలుగు బాగా తెలుసు. ఒకవేళ అర్థంకాని మాండలిక పదాలు ఉంటే తెలుసుకునే వారు.
Also Read: సాన కష్టం అంటూ మాస్ స్టెప్పులతో దుమ్మురేపనున్న ఆచార్య… సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే ?
పాటలోని పదాలు అర్థాలు అర్ధం చేసుకున్న తర్వాత, దర్శకుడి నుండి ఆ సన్నివేశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇక వెంటనే ఆ రోజు సాయంత్రమే ఆ పాటకు బాణీ కట్టి వినిపించేస్తారు. ఇలా రెండు రోజుల్లోనే మూడు పాటలకు పకడ్బందీగా సంగీతం సమకూర్చారు. కానీ మరో పాటకు మాత్రం నాలుగు సమయం తీసుకున్నారు.
ఏది ఏమైనా ఇళయరాజా గారు పాట కోసం పెట్టే శ్రమ గొప్పది. ఆయన గొప్ప సంగీతాన్ని అందించేందుకు పడే తపన, కార్యదీక్ష, క్రమశిక్షణ క్షణక్షణం ఆయనలో కనబడుతునే ఉంటుంది. పైగా పాటలకు సంగీతం ఆడించడం తనకు దొరికిన గొప్ప అవకాశంగా ఆయన భావిస్తారు. అందుకే, వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రను వేశారు ఇళయరాజా.
Also Read: కేసీఆర్ రాంగ్.. జగనే రైటా? ఆర్ఆర్ఆర్.. సినిమా టికెట్ రేట్ తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయ్?